Govt Employees: పండగ వేళ.. ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
ABN , Publish Date - Jan 12 , 2026 | 06:22 PM
మరికొన్ని గంటల్లో ప్రజలు సంక్రాంతి పండగ జరుపుకోనున్నారు. అలాంటి వేళ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
హైదరాబాద్, జనవరి 12: మరికొన్ని గంటల్లో ప్రజలు సంక్రాంతి పండగ జరుపుకోనున్నారు. అలాంటి వేళ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. 2023, జులై 1వ తేదీ నుంచి ఈ డీఏ అమలు చేయాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
2026 జనవరి మాసంలో తీసుకునే జీతంతో కలిపి ఈ డీఏ చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో వివరించింది. జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఉద్యోగులకు సైతం ఈ డీఏను వర్తింప చేయనున్నారు. యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు కూడా ఈ డీఏ కింద నిధులు చెల్లించనున్నారు. 30.03 శాతం నుంచి 33.67 శాతానికి ఈ డీఏను ప్రభుత్వం సవరించిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంతకీ సంక్రాంతి జనవరి 14 లేదా 15నా.. ఎప్పుడు జరుపుకోవాలి?
దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..
Read Latest Telangana News And Telugu News