Share News

పర్యాటకాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:37 AM

ఆత్రేయపురం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభు త్వం ఎంతో ప్రాధాన్యమిస్తూ ఆ దిశగా అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర హోంశాఖామంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సర్‌ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ పేరిట టూరిజంశాఖ భాగస్వామ్యంతో నిర్వహించిన ఆత్రేయపురం ఉత్సవ్‌ మంగళవారం ఘనంగా ముగిసింది. 3 రోజులపాటు నిర్వహించిన డ్రాగన్‌ పడవ పోటీలు సహా స్విమ్మింగ్‌, రంగవల్లులు,

పర్యాటకాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం
ఫుడ్‌ ఫెస్టివల్‌ వద్ద సెల్ఫీ తీసుకుంటున్న మంత్రి అనిత

హోంమంత్రి వంగలపూడి అనిత

ఆత్రేయపురంలో రసవత్తరంగా ముగిసిన డ్రాగన్‌ పడవ పోటీలు

ముగింపు సభలో పాల్గొన్న మంత్రులు అనిత, కొండపల్లి, దుర్గేష్‌

విజేతలకు బహుమతులు అందజేసిన కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ

వెయ్యి మీటర్ల విభాగంలో ప్రథమ విజేత బండారు టీమ్‌ (ఏలూరు)

500 మీటర్ల విభాగంలో ప్రథమ విజేత ఎర్రకాలువ టీమ్‌ (జంగారెడ్డిగూడెం)

ఆత్రేయపురం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభు త్వం ఎంతో ప్రాధాన్యమిస్తూ ఆ దిశగా అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర హోంశాఖామంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సర్‌ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ పేరిట టూరిజంశాఖ భాగస్వామ్యంతో నిర్వహించిన ఆత్రేయపురం ఉత్సవ్‌ మంగళవారం ఘనంగా ముగిసింది. 3 రోజులపాటు నిర్వహించిన డ్రాగన్‌ పడవ పోటీలు సహా స్విమ్మింగ్‌, రంగవల్లులు, పతంగులు పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. మంగళవారం మూడోరోజు ఫైనల్స్‌ పోటీలను హోంమంత్రి వం గలపూడి అనిత, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌, చిన్నతరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. పోటీలు ముగిసిన అనంతరం బహుమతుల ప్రధాన కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్కంఠంగా సాగిన పడవ పోటీల్లో వెయ్యి మీటర్ల విభాగంలో ఏ లూరు కు చెందిన బండారు టీమ్‌, 500 మీటర్ల విభాగంలో జంగారెడ్డిగూడేనికి చెందిన ఎర్రకాలువ టీమ్‌ ప్రథమస్థానాల్లో నిలిచాయి.

కోనసీమలో ముందే సంక్రాంతి

ముందుగా ముగింపు సభలో మంత్రి అనిత మాట్లాడుతూ కోనసీమలో సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్నారు. కేరళలో జరిగే పడవ పోటీలు కోనసీమ ప్రాంతానికి తీసుకురావడం ఎంతో గర్వకారణమన్నారు. తొలుతగా ఆమె జ్యోతి ప్రజల్వన నిర్వహించి జెండాఊపి పోటీలు ప్రారంభించారు. అనంతరం మాట్లాడు తూ డ్రాగన్‌ పడవ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒలింపిక్స్‌లో ప్రాధాన్యమిచ్చేలా చర్య లు చేపడతామన్నారు. ఆత్రేయపురం ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఈ పోటీలను నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బండారును అభినందించారు.

ఫుడ్‌ ఫెస్టివల్‌లో హోంమంత్రి..

లొల్లలాకుల వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్‌ ఫెస్టివల్‌ను హోంమంత్రి అనిత సందర్శించారు. ఆత్రేయపురం పూతరేకులను రుచి చూశారు. దారంతో అల్లిన లేసులు, జూట్‌ బ్యాగులను పరిశీలించి కొనుగోలు చేశారు. సంక్రాంతి ఉత్సవం సెట్టింగ్‌, ఫొటోషూట్‌ వద్ద, సెల్ఫిపాయింట్ల వద్ద హోంమంత్రితోపాటు ప్రజాప్రతినిధులు సెల్ఫీలు దిగారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా పలువురు కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. కాటికాపరి, సోది చెబుతాం, పిట్టల దొర, జంగం దేవర, కొమర దాసు, హరిదాసు, కళాకారులు వేదిక వద్ద ప్రముఖులను ఆకట్టుకున్నారు. హోంమంత్రి అనిత, పర్యాటకశాఖమంత్రి దుర్గేష్‌ సరదాగా సోది చెప్పించుకున్నారు.

Updated Date - Jan 14 , 2026 | 12:37 AM