ఊరొస్తున్నాం!
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:58 AM
గత నాలుగు రోజులుగా పల్లెలు కళకళలా డుతున్నాయి.. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు..
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
గత నాలుగు రోజులుగా పల్లెలు కళకళలా డుతున్నాయి.. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు.. అటు విమానాలు ఖాళీ లేవు.. రైళ్లూ ఖాళీ లేవు.. చివరికి ఆర్టీసీ బస్సులదీ ఇదే పరిస్థితి.. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు క్యూకడుతున్నారు.. నిన్నటి వరకూ జిల్లా వ్యాప్తంగా నీరసం ఆవహించిన పల్లెల్లో ప్రస్తుతం ప్రతి ఇంటా పెద్ద పండుగలా ఉంది.. పుట్టిన ఊరంటే ఎవరికి మాత్రం అభిమానం ఉండదు.. ఆ ఊరుతో ఎన్నో జ్ఞాపకాలు.. ఎంతో మమకారం..మరెంతో అనుబంధం.. ఎంత ఎది గినా.. ఎక్కడున్నా.. సంక్రాంతి వచ్చిందంటే ఆ ఊరులో వాలిపోవాల్సిందే..ఆ గాలి పీల్చాల్సిందే.. స్నేహితులతో ఆనందంగా గడపాల్సిందే.. మరో 48 గంటల్లో భోగి పండుగతో సంక్రాంతి ఆరం భం కానుంది.. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా హైదరాబాద్.. చెన్నై..బెంగళూరు నుంచి దారులన్నీ గోదావరి జిల్లాల వైపే.. ఎక్క డెక్కడో స్ధిరపడిన ఎన్నారైలు పల్లెబాట పట్టారు. సంక్రాంతికి సందడి చేసేం దుకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే పల్లెలు, పట్టణాలు కళకళలాడుతున్నాయి.సంప్రదాయంగా పండగ జరుపుకునేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇళ్లల్లో అందరితో సరదాగా గడపడంతో పాటు ఊరంతా తిరిగి.. ఒళ్లు పులకరించేలా అందరినీ పలకరిస్తున్నారు. మరో వైపు రాజ మహేంద్రవరంలో స్టార్ హోట ళ్లతో పాటు పెద్దహోటళ్లలో 450 రూమ్‌లు బుక్కయిపోయాయి. ఇక చిన్న,మీడియం సైజ్ హోటల్, లాడ్జీలు, ఫంక్షన్ హాల్స్, విడిదిళ్లు చాలా వరకూ నిండాయి. చిన్న హోటళ్లు లాడ్జీ ల్లో 1400 గదుల వరకూ ఉన్నాయి.
విమానాలు ఫుల్
రాజమహేంద్రవరం విమానాశ్రయం నుం చి దేశంలోని పలు ప్రాంతాల నుంచి బం ధుగణం వస్తూనే ఉన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, న్యూఢిల్లీ నుంచి రెగ్యులర్‌గా, ముంబ యికి మూడు రోజు లు, తిరుపతికి మూడు రోజుల పాటు విమానాలు రాకపోకలు సాగుతున్న సం గతి తెలిసిందే. ప్రస్తుతం రోజుకు రాజమ హేంద్రవరం విమానాశ్రయం నుంచి 1800 మంది రాకపోకలు సాగిస్తున్నారు. రెండు రోజుల నుంచి వచ్చే వారితో విమా నాలన్నీ ఫుల్ అవుతున్నా యి.వెళ్లేవారు తగ్గారు. కనుమ తర్వాత వెళ్లిపోవడానికి టిక్కెట్లు బుక్ అయ్యాయి.
రైళ్లు కిట కిట..
రాజమండ్రి రైల్వేస్టేషన్ నుంచి సాధారణ రోజుల్లో సుమారు 30 వేల మంది ప్రయాణి స్తుంటారు. ప్రస్తుతం సుమారు 40 వేల మంది వరకూ ప్రయాణిస్తుండడం గమనార్హం. ఇక రాజమండ్రి మీదగా ఉత్తరాంధ్ర వైపు వెళ్లే రైళ్లన్నీ ఫుల్‌గా ఉండడం గమనార్హం.
ఆర్టీ..సీ..!
ఇక ఆర్టీసీ ద్వారా ఇతర రాష్ర్టాలు, ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం రోజుకు 45 వేల మంది వరకూ వస్తున్నట్టు ఆర్టీసీ అధికారుల కథనం. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతు న్నారు. ప్రస్తుతం బస్సులన్నీ కిటకిటలాడు తున్నాయి.