Share News

మూలాలు మరవద్దు

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:38 AM

కొవ్వూరు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మన తల్లిదండ్రుల్లానే మన మూలాలను ఎవ్వరూ మ ర్చిపోరాదని నేషనల్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ దర్శకుడు చందు మొండేటి అన్నారు. తూ ర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వేములూరులో మంగళవారం విజయ గణపతి ఆలయ కమిటీ సభ్యుడు, డైరెక్టర్‌ చందు దంపతు

మూలాలు మరవద్దు
చందు మొండేటి దంపతులను సన్మానిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

వాయుపుత్ర సినిమా తెరకెక్కిస్తున్నా

సినీ దర్శకుడు చందు మొండేటి

కొవ్వూరు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మన తల్లిదండ్రుల్లానే మన మూలాలను ఎవ్వరూ మ ర్చిపోరాదని నేషనల్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ దర్శకుడు చందు మొండేటి అన్నారు. తూ ర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వేములూరులో మంగళవారం విజయ గణపతి ఆలయ కమిటీ సభ్యుడు, డైరెక్టర్‌ చందు దంపతులను, కుటుంబసభ్యులను సన్మానించారు. అంతకుముందు ఆలయంలో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ ‘‘నా చిన్నతనం నుంచి మా తాతఊరు కొవ్వూరు మం డలం వేములూరు వస్తుండేవాడిని. అదృష్టం కొద్ది మా నాన్న రిటైర్డ్‌మెంటు తరువాత వేములూరులోనే స్థిరపడ్డారు. మన తల్లిదండ్రుల్లానే మనసొంత ఊరు, మూలాలను గట్టిగా నమ్ముతాను. విజయ గణపతి ఆలయం వద్ద వినాయకచవితికి రోడ్డుపై తెర కట్టి సినిమాలు వేసేవా రు. మిత్రులతో కలిసి రోడ్డుపై కూర్చుని చూసేవాడిని. మా తరువాత మా అన్నయ్య పిల్లలు, నా పిల్లలు పండుగలను వేములూరులోనే జరుపుకుంటున్నారు. నా చిన్నతనంలో చాలా చిన్న ఆలయం ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది’’ అని పేర్కొన్నారు. కార్తికేయ 1 నా మొదటి సిని మా. తరువాత ప్రేమమ్‌, సవ్యసాచి, కార్తికేయ 2, తండేల్‌ సినిమాలు చేశాను. ప్రసుత్తం త్రిడీ యానిమేషన్‌లో వాయుపుత్ర సినిమా చేస్తున్నా. రామాయణంలో హనుమంతుడు సీతమ్మ వద్ద కు వెళ్లడం. అక్కడ జరిగిన సంఘటనను క్లుప్తం గా భవిష్యత్‌తరాలకు అర్ధమయ్యే విధంగా కథ ను చేర్చాలని సంకల్పంతో సినిమా చేస్తున్నాను. మరో 2 కొత్త సినిమాలు నడుస్తున్నాయి. కార్తికే య 3 కూడా ఉంది’’ అని వెల్లడించారు. కార్యక్రమంలో టీఎన్వీ రమణమూర్తి, తాడిమళ్ల విజయవాణి, మేడూరి వీర్రాజు, పెరవలి రంగాప్రసాద్‌, విజయ గణపతి ఆలయ కమిటీ సభ్యులున్నారు.

Updated Date - Jan 14 , 2026 | 12:38 AM