‘బరి’తెగించేశారు!
ABN , Publish Date - Jan 13 , 2026 | 01:33 AM
సంక్రాంతి సమీపించడంతో ఉమ్మడి జిల్లా లో భారీఎత్తున కోడిపందేలకు ఏర్పాట్లు జరుగు తున్నాయి. ఎక్కడికక్కడ మండలాల్లో గ్రామాల వారీగా బరులు, గుండాటలకు నేతల ఆదేశాల తో దళారులు వేలం పాటలు నిర్వహిస్తున్నారు. లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు.
సంక్రాంతి కోడిపందేలకు ఉమ్మడిజిల్లాలో భారీగా సిద్ధమవుతున్న బరులు
బరులతో సమానంగా గుండాటల నిర్వహణకు గ్రామాలవారీగా వేలం పాటలు
పెద్ద గ్రామాల్లో బరులకు రూ.15 లక్షలు, గుండాట అనుమతికి రూ.35 లక్షలు
బరులవారీగా వసూలు చేసే వేలం డబ్బుల్లో నేతలు, పోలీసు, రెవెన్యూకు వాటాలు
ఐ.పోలవరం మండలం మురమళ్లలో భారీ బరికి షామియానాలు, ఫ్లడ్‌లైట్లు, లైవ్
కరపలో రెండు బరులకు రూ.72 లక్షల బేరం.. కొంగోడులో గెలిస్తే ఇన్నోవా కారు
ప్రతి మండలంలో బరులు, గుండాట వేలం ద్వారా ఆయా స్టేషన్లకు వాటాలు, కోసలు
(కాకినాడ- ఆంధ్రజ్యోతి)
సంక్రాంతి సమీపించడంతో ఉమ్మడి జిల్లా లో భారీఎత్తున కోడిపందేలకు ఏర్పాట్లు జరుగు తున్నాయి. ఎక్కడికక్కడ మండలాల్లో గ్రామాల వారీగా బరులు, గుండాటలకు నేతల ఆదేశాల తో దళారులు వేలం పాటలు నిర్వహిస్తున్నారు. లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. పండగ మూడు రోజులు పోలీసులు, రెవెన్యూ అధికారు లు చూడకుండా ఉండేలా వారికి సైతం భారీ ప్యాకేజీలు ముట్టజెప్పడానికి ఏర్పాట్లు జరుగుతు న్నాయి. కోడిపందేల బరులకు పెద్దగ్రామాల్లో రూ.15 లక్షలు, గుండాట అనుమతికి పది బోర్డు లకు రూ.35లక్షల చొప్పున వేలం పాటలు పూర్త య్యాయి. చిన్న గ్రామాల్లో బరులకు రూ.5లక్షల నుంచి రూ.8 లక్షలు, గుండాట బోర్డుకు రూ.50 వేల వరకు పాటలు జరు గుతున్నాయి. బరుల వారీగా వసూలు చేసిన డబ్బుల్లో స్టేషన్ల వారీగా పంపకాలు చేయనున్నారు. జగ్గంపేటలో ఓ పా మాయిల్ తోటలో జిల్లాస్థాయిలో కోడిపందేల బరి,గుండాటకు రూ.36లక్షల వేలంపాట పూర్త యింది. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప లో బరికి రూ.37 లక్షలకు పాట జరిగింది. కరప లో మూడురోజుల పందేల్లో ఎక్కువ గెలిచిన వా రికి ఇన్నోవాకారు బహుమతి ఇవ్వనున్నారు. ఐ.పోలవరం మురమళ్లలో ఉమ్మడి జిల్లాకే అతి పెద్ద బరి సిద్ధమైంది. బరి చుట్టూ ఫెన్సింగ్, షా మియానా, ఫ్లడ్ లైట్లు బిగిస్తున్నారు. మరోపక్క కాకినాడ, కోనసీమ, తూ.గో.జిల్లాల్లో హై వే వెంబడి, తీర ప్రాంతంలోని తోటల్లో బరులు సిద్ధమయ్యాయి.
ఎక్కడి రేట్లు అక్కడే...
ఉమ్మడి జిల్లాలో ఈ సంక్రాంతికి కోడిపందేలు అడ్డుఅదుపు లేకుండా ఆడించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండగ మూడురోజుల్లో అనేక మండలాల్లో గ్రామాల వారీగా పందేల నిర్వాహ కులు అప్పుడే పెద్దఎత్తున బరులు సిద్ధం చేస్తు న్నారు. ఇందుకోసం బరుల వారీగా వేలం పాట లు నిర్వహిస్తున్నారు. బరుల పక్కనే గుండాటకు అనుమతుల పేరుతో రేట్లు కడుతున్నారు. మం డలాన్ని బట్టి పెద్దగ్రామంలో పందేలు, గుండా టకు కలిపి ఒక రేటు, చిన్న గ్రామాల్లో మరో రేటు నిర్థారించి వేలం జరుపుతున్నారు. ఇలా వసూలు చేసిన డబ్బుల్లో బరుల నిర్వహణ ఖర్చులు, విందుపోను నేతలు, పోలీసు, రెవెన్యూ శాఖలకు డబ్బులు పంపకాలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద గ్రామాల్లో అప్పుడే వేలం పాటలు పూర్తవగా, చిన్నగ్రామాల్లో ఇంకా కొనసాగు తున్నాయి. ప్రస్తుతం పందేలు, గుం డాటకు కలిపి పెద్ద గ్రామాల్లో రూ.20 లక్షల నుంచి అత్యధికంగా రూ.36లక్షల వరకు వేలం పాటలు జరిగాయి. చిన్నగ్రామాల్లో బరులు, గుం డాటకు విడివిడిగా వేలం జరుగుతోంది. ప్రధా నంగా జగ్గంపేట మండలంలో రెండుచోట్ల భారీ బరులను సిద్ధం చేస్తున్నారు. పామాయిల్ తోటలో జిల్లాస్థాయిలో పందేలు నిర్వహించడా నికి ఇక్కడ రెండుబరుల్లో ఒకదానికి రూ.35 లక్షలు, మరో బరికి రూ.37లక్షలకు వేలం పూర్త యింది. ఈ డబ్బుల్లో కొంత బరుల నిర్వహణకు ఖర్చుచేసి, స్థానిక ఆలయ ఉత్సవాలకు కొంత తీసి మిగిలింది నేతలు, పోలీసు, రెవెన్యూ అధి కారులు పంచుకునేలా ఒప్పందాలు కుదిరాయి. సరాసరి ఓ మండలంలో ఉండే స్టేషనకు అన్ని బరుల నుంచి కలిపి మూడు రోజులకు రూ.12 లక్షల వరకు అందనుంది. అటు కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ.పోలవరం మండలం మురమళ్లలో ఉమ్మడిజిల్లాకు అతిపెద్ద భారీ బరి సిద్ధమైంది. ఓ నేత అనుచరుల కను సన్నల్లో భారీ షామియానాలు,టెంట్లు, ఫ్లడ్‌లైట్లు, ఫెన్సింగ్ ఏర్పాటుచేస్తున్నారు. ఇక్కడ పందేలు ఆడించడం ద్వారా రూ.2కోట్ల వరకు ఓ కీలక నేతకు మిగిలేలా ఒప్పందాలు జరిగాయి. అలాగే రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్, మం డపేట, అమలాపురం, అమలాపురంరూరల్, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బరు లకు వేలంపాటలు పూర్తయ్యాయి. ఆయా ప్రాం తం బట్టి రూ.30లక్షల వరకు బేరాలు జరిగాయి. కాకినాడ జిల్లాలో హైవేను ఆనుకుని ఉన్న ప్రత్తిపాడు, తుని, కోటనందూరు, గండేపల్లి, కిర్లంపూడి మండలాల్లో హైవేను ఆనుకుని ఉన్న తోటల్లో విశాఖ నుంచి వచ్చే పందెంరాయుళ్ల డిమాండ్ నేపథ్యంలో రూ.20 లక్షల వరకు వేలంపాటలు జరిగాయి.
గెలిస్తే ఇన్నోవా..
కాకినాడను ఆనుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో భారీగా పందేలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటికి బడాబాబులు వచ్చే అవకాశం ఉన్నందున షామియానాలు, లైవ్ ప్రసారాలు, అక్కడికక్కడే పందేలకు వీలుగా మైక్‌సెట్లు వంటివి ఏర్పాటుచేస్తున్నారు. ప్రధా నంగా సర్పవరం, వాకలపూడి, కరప మండ లాల్లో ఒక్కో బరికి గుండాట అనుమతులతో కలి పి వేలం లక్షల్లో నాలుగురోజుల కిందే పూర్త యింది. సర్పవరంలో ఓ బరికి ఏకంగా రూ.45 లక్షలకు వేలం కుదిరింది. కరపలో పెనుగుదురు రూ.35లక్షలు, గొర్రిపూడిలో రెండు బరులు, గుం డాటకు చెరో రూ.15లక్షలు, గురజనాపల్లి కొం గోడు రూ.25 లక్షలు, విజయరాయుడుపాలెం రూ.9 లక్షలకు వేలంపాటలు ఖరారయ్యాయి. ఈ బరులనుంచి రూరల్, కరప పోలీసుస్టేషన్లకు రోజుకు రూ.10 లక్షలకుపైగా మామూళ్లు ఇవ్వ డానికి సిద్ధం చేశారు. మరోపక్క కరపలో ఓ బరిలో మూడు రోజులకు కలిపి నిర్వహించే పం దేల్లో అత్యధికంగా నెగ్గేవారికి ఇన్నోవా ఇవ్వను న్నారు. గతేడాది గెలిచిన విజేతకు మహీంద్రా థార్ జీపు బహుమతిగా ఇచ్చారు. అలాగే కరప మండలం కొరిపల్లిలో అత్యధిక పందేలు గెలిచిన వారికి బుల్లెట్ ఇవ్వనున్నారు. అలాగే పెద్దాపు రం, సామర్లకోట, తాళ్లరేవు, బిక్కవోలు, రాయ వరం, అల్లవరం, రాజోలు, సఖినేటిపల్లి తదితర మండలాల్లోను వేలంపాటలు లక్షల్లోకి వెళ్లింది.