సంక్రాంతి సంబరాలకు సత్యదేవుడి సన్నిధి ముస్తాబు
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:39 AM
అన్నవరం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధి సంక్రాంతి సంబరాలకు ముస్తాబైంది. బుధవా రం ఉదయం 5.30కి తపోవనం స
నేడు ఉదయం వేడుకలు ప్రారంభం.. తెలుగుదనం ఉట్టిపడేలా పలు ప్రదర్శనలు
అన్నవరం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధి సంక్రాంతి సంబరాలకు ముస్తాబైంది. బుధవా రం ఉదయం 5.30కి తపోవనం సచ్చిదానంద స్వామీజీ చేతులమీదుగా భోగిమంటతో వేడుకలు ప్రారంభమవుతాయి. తెలుగుదనం ఉట్టి పడేవిధంగా కోడిపుంజులు, ఎడ్ల బండి, జంగమదేవర, బుడబుక్కల వేషధారణతో పాటుగా బొమ్మల కొలువులు, తెలుగు పిండివంటకాలు, ధా న్యపురాశులు, కొలను తదితర వాటిని ఏర్పా టు చేయనున్నట్టు చేయనున్నారు. ఆధునిక ప్రపంచంలో పూర్వపు సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకు తెచ్చుకోనేవిధంగా ఏర్పాటు చేసినట్టు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు.