హైలెస్సో.. హైలెస్సా!
ABN , Publish Date - Jan 13 , 2026 | 01:31 AM
సర్ ఆర్ధర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఆత్రేయపురం ఉత్సవ్, రాష్ట్ర పర్యాటక శాఖ సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న జాతీయస్థాయి డ్రాగన్ పడవ పోటీలు సోమవారం హోరాహోరీగా సాగాయి. డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం-తాడిపూడి వంతె న నుంచి ఉచ్చిలి వరకూ సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువలో కిలోమీటరు పరిధిలో ఈ డ్రాగన్ పడవ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి.
ఉత్సాహభరితంగా జాతీయ స్థాయి డ్రాగన్ పడవ పోటీలు
పోటీలను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు, ఆర్డీవో శ్రీకర్
హోరాహోరీగా తలపడిన టీమ్‌లు 8 నేడు ఫైనల్స్.. మంత్రుల రాక
ఆత్రేయపురం,జనవరి12(ఆంధ్రజ్యోతి): సర్ ఆర్ధర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఆత్రేయపురం ఉత్సవ్, రాష్ట్ర పర్యాటక శాఖ సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న జాతీయస్థాయి డ్రాగన్ పడవ పోటీలు సోమవారం హోరాహోరీగా సాగాయి. డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం-తాడిపూడి వంతె న నుంచి ఉచ్చిలి వరకూ సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువలో కిలోమీటరు పరిధిలో ఈ డ్రాగన్ పడవ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజున పడవ పోటీలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్డీవో శ్రీకర్ జెండా ఊపి ప్రారంభించారు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి మొత్తం 22 టీమ్‌లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఒక్కొ క్క టీమ్ నుంచి 10మంది చొప్పున జల క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ పడవ పోటీలను తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. కాలువగట్టు ఇరువైపులా, తాడిపూడి వం తెనపై జనం నిండిపోయారు. కేరళలో జరిగే ఈ తరహా పోటీలు కోనసీమలోను నిర్వహిస్తుండడంతో వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు భారీగా తరలి వచ్చి తిలకించారు. సోమవారం ఉదయం నుంచి మొత్తం 22 టీమ్‌లకు పోటీలు జరిగాయి. వీటిలో 12 టీమ్‌లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. తర్వాత ఆ టీమ్‌ల మధ్య జరిగిన హోరాహోరీ పోటీల్లో 6 టీమ్ లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. మంగళవారం జరి గే సెమీఫైనల్స్‌లో బండారు టీమ్, కోనసీమ టీమ్, పల్నాడు టీమ్, కేరళ టీమ్, అలెప్పి టీమ్, ఎర్రకాలు వ టీమ్‌లు సెమీఫైనల్స్‌లో తలపడనున్నాయి. ఇందు లో గెలిచిన టీమ్‌లు మొదటి మూడు స్థానాల్లో విజేతలుగా నిలువనున్నాయి. ప్రథమ విజేత రూ.2లక్షలు, ద్వితీయ విజేత రూ.1 లక్ష, తృతీయ రూ.50వేలు ట్రోఫీలతో విజేతలను సత్కరించనున్నారు. కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మెట్ల రమణబా బు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, డిప్యూటీ కలెక్టర్ పి. రాజేశ్వరరావు, వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకట్రాజు, ట్రోఫీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కూసంపూడి రామకృష్ణంరాజు, వెత్సా అనిల్, జిల్లా పర్యాటక అధికారి అన్వర్ పాల్గొన్నారు. కాగా డ్రాగన్ పోటీల ముగింపు సభకు మం గళవారం రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, హోంశాఖామంత్రి వంగలపూడి అనిత, ఇతర మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, బహుమతుల ప్రదానోత్సవంలో పాల్గొంటారు. అలాగే పతంగుల పోటీలు నిర్వహిస్తారు.ఙ
లొల్ల లాకుల వద్ద సందడే సందడి
ఎన్నో అందాలను సొంతం చేసుకున్న లొల్ల లాకుల వద్ద పర్యాటకులు సందడి చేశారు. పడవ పోటీల్లో భాగంగా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న వేడుకల సందర్భం గా అందమైన లాకుల వద్ద ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. గోదావరి ప్రాంత ఇష్టమైన వంటకాలను స్టాల్స్‌లో ఏర్పాటుచేశారు. పూత రేకులు, వేడివేడి బొబ్బట్లను లైవ్‌లో అందిస్తున్నారు. ఆర్గానిక్ వంటకాలు వస్ర్తా లు, వివిధ రకాల ఐటమ్స్‌ను ఫుడ్‌ఫెస్టివల్స్‌లో ఏ ర్పాటు చేశారు. పర్యాటకులు లొల్ల లాకుల అందాలను ఆస్వాదిస్తున్నారు.
ఆకర్షణగా స్కైబోటు విన్యాసం
జాతీయస్థాయి డ్రాగన్ పడవ పోటీల్లో భాగంగా సోమవారం ప్రధాన కాలువలో కేరళ యు వకుడు స్కైబోటుపై చేసిన విన్యాసం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంది. పడవ పోటీలు జరుగుతున్న సమయంలో వేలాదిమంది ఈ ప్రదర్శన తిలకించి ముగ్ధులయ్యారు.