చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం టీఎస్ అగ్రహారంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేశాయి. గ్రామంలోని పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు వరి, టమాటా పంటలను తొక్కి నాశనం చేశాయి.
80వ స్వాతంత్య్ర దిన వేడుకలు శనివారం జిల్లావ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.తిరుపతిలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు...
స్వాతంత్య్ర స్ఫూర్తితో అభివృద్ధి.. సంక్షేమం సమాహారంగా స్వర్ణ చిత్తూరు సాకారమవుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. చిత్తూరు పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి.. కూటమి ప్రభుత్వం జిల్లాలో చేసిన అభివృద్ధి, సాధించిన ప్రగతి గురించి వివరించారు.
స్థానిక ముంబయి - చెన్నై జాతీయ రహదారిలో ద్విచక్ర వాహనాన్ని మినీ లారీ ఢీకొనడంతో యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు...
‘వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి.. అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. కూటమి ప్రభుత ్వం రాగానే ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం.. పెట్టుబడులు ఆకర్షిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం..’ అని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖా మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ జిల్లా కేంద్రం మదనపల్లె పోలీసు పరేడ్ గ్రౌండులో శనివారం ఘనంగా నిర్వహించారు.
వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థిస్తూ తిరుమలలో ఐదురోజుల పాటు వరుణయాగాన్ని నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.
స్వాతంత్య్ర దినోత్సవం సంధర్బంగా శనివారం స్విమ్స్‌లో ఓపీలు, ఓటీలకు సెలవు ప్రకటించినట్లు డైరెక్టర్ ఆర్‌వీ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుపతి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఏపీ సంపర్క్ క్రాంతి వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్లో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
ద్రౌపదీ సమేత ధర్మరాజు స్వామి తిరునాళ్లను పురస్కరించుకుని ఫ్లెక్సీ ఏర్పాటు చేసే క్రమంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి చెందారు.