Share News

శైవక్షేత్రాలకు 146 బస్సుల తరలింపు

ABN , Publish Date - Feb 14 , 2026 | 01:07 PM

శివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలో పలు శైవక్షేత్రాలకు జిల్లాలోని వివిధ డిపోల నుంచి 146 ఆర్టీసీ బస్సులు తరలివెళ్లాయి.

 శైవక్షేత్రాలకు 146 బస్సుల తరలింపు

తిరుపతి: శివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలో పలు శైవక్షేత్రాలకు జిల్లాలోని వివిధ డిపోల నుంచి 146 ఆర్టీసీ బస్సులు తరలివెళ్లాయి. నరసారావుపేట జిల్లా కోటప్పకొండ(Kotappakonda)కు 70 సప్తగిరి ఎక్స్‌ప్రెస్‏లు, 6 సాధారణ ఎక్స్‌ప్రెస్‏లు, మదనపల్లెలోని మల్లయ్యకొండకు 30 సప్తగిరి ఎక్స్‌ప్రెస్‏లు, శ్రీశైలానికి సాధారణ ఎక్స్‌ప్రెస్‏లు 30, అల్ర్టాడీలక్స్‌లు 2, సూపర్‌లగ్జరీలు 8 బస్సులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి బయల్దేరి వెళ్లాయి.


శని, ఆది, సోమవారాల్లో ఆయా క్షేత్రాలకు రాకపోకలు సాగించి శివభక్తులను గమ్యస్థానాలకు చేర్చనున్నాయి. మంగళవారం ఉదయానికి తిరిగిరానున్నాయి. జిల్లాలో బస్సుల కొరత ఏర్పడకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. తిరుమల(Tirumala)కు ఎలక్ర్టిక్‌ బస్సులను పూర్తిస్థాయిలో తిప్పనున్నారు.


zzzzzzzz.jpgకడప, నెల్లూరు, మదనపల్లె పట్టణాలకు తిరిగే ఎలక్ర్టిక్‌ బస్సుల్లో కొన్నింటిని దారిమళ్లించారు. చెన్నై, బెంగళూరు, కంచి, వేలూరు, సత్యవేడు వంటి దూరప్రాంతాలకు ఆపివేసి మూడురోజుల పాటు ఘాట్‌సెక్షన్‌కు కేటాయించారు. తిరుపతి - శ్రీకాళహస్తికి నడిపేందుకు చిత్తూరు 1, 2 డిపోల నుంచి 10 ఎక్స్‌ప్రెస్‌ బస్సులు రప్పించారు. సిబ్బంది కొరతతో డ్యూటీలు కేటాయించడం అధికారులకు తలనొప్పిగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగు

అల్లు వారి.. పెళ్లి ప‌నులు షురూ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 14 , 2026 | 01:07 PM