కమిషనర్ లాగిన్ కాదు.... కార్పొరేషన్ లాగిన్ దుర్వినియోగం
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:18 AM
తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో తన లాగిన్ దుర్వినియోగం కాలేదని కమిషనర్ ఎన్.మౌర్య శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇంటి పన్నుల పేర్ల మార్పు అంశం డిప్యూటీ కమిషనర్ పరిధిలో వుంటుందని, కమిషనర్ లాగిన్‌తో ఎలాంటి సంబంధం లేదన్నారు.
తిరుపతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో తన లాగిన్ దుర్వినియోగం కాలేదని కమిషనర్ ఎన్.మౌర్య శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇంటి పన్నుల పేర్ల మార్పు అంశం డిప్యూటీ కమిషనర్ పరిధిలో వుంటుందని, కమిషనర్ లాగిన్‌తో ఎలాంటి సంబంధం లేదన్నారు. నగర పాలక సంస్థ రెవిన్యూ విభాగంలో ఆస్తి పన్ను మదింపు, ఆస్తి పన్ను పేరు మార్పు వంటి అంశాలకు సంబంధించిన అధికారాలను కమిషనర్‌గా తాను డిప్యూటీ కమిషనర్‌కు బదలాయించడం జరిగిందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు నగర పాలక సంస్థ ఈఆర్‌పీ వెబ్‌సైట్‌లో బ్యాక్ ఎండ్‌లో ఎలాంటి పత్రాలూ లేకుండా, సంబంధిత అధికారులకు తెలియకుండా ఇంటి యజమానుల పేర్లు మార్చినట్టు ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై పరిశీలించగా సుమారు 190 ఇళ్ళకు సంబంధించి ఇంటి యజమానుల పేర్లు మార్చివేసినట్టు తెలుసుకున్నామన్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ కమిషనర్ తన దృష్టికి తీసుకురాగా ఇది సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది కనుక విచారణ జరపాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు.నగర పాలక సంస్థ లాగిన్‌ను దుర్వినియోగం చేసి ఇంటిపన్నులను మార్చుకున్న యజమానులను విచారించి వెబ్‌సైట్ బ్యాక్ ఎండ్‌లో పేర్లు మార్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.