పంటలపై ఆగని ‘గజ’ దాడులు
ABN , Publish Date - Feb 15 , 2026 | 01:10 AM
పులిచెర్ల మండలంలో పంటలపై గజ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని సూరప్పచెరువు నుంచి శుక్రవారం రాత్రి బయల్దేరిన జంట ఏనుగులు పాళెం పంచాయతీ జూపల్లె వద్దకు చేరుకున్నాయి.
కల్లూరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలంలో పంటలపై గజ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని సూరప్పచెరువు నుంచి శుక్రవారం రాత్రి బయల్దేరిన జంట ఏనుగులు పాళెం పంచాయతీ జూపల్లె వద్దకు చేరుకున్నాయి. బాబు, శివయ్య, వెంకటరత్నం, కళావతి, సుబ్రహ్మణ్యంలకు చెందిన మామిడిచెట్ల కొమ్మలను విరిచేశాయి. జొన్నపంట, పశుగ్రాసాన్ని ధ్వంసం చేశాయి. డ్రిప్ పైపులను విరిచేశాయి. పాళెంలో రైతు మురళీధర్‌కు చెందిన మామిడిచెట్లను ధ్వంసం చేసి, కోటపల్లె చేరుకున్నాయి. హరినాథ్‌కు చెందిన జొన్న, పశుగ్రాసం ధ్వంసం చేశాయి. అనంతరం జంట ఏనుగులు అడవికి తిరుగుముఖం పడుతూ.. ఆ మార్గంలోని మామిడిచెట్ల కొమ్మలను విరిచేశాయి. ధ్వంసమైన పంటలను అటవీ సిబ్బంది శనివారం ఉదయం పరిశీలించారు. శుక్రవారం పగలంతా జంట ఏనుగులు సూరప్పచెరువు వద్ద సంచరించినట్లు స్థానికులు తెలిపారు.