రేపు పాఠశాలలకు సెలవు
ABN , Publish Date - Feb 15 , 2026 | 01:14 AM
మహా శివరాత్రి సందర్భంగా సోమవారం పాఠశాలలకు ఆప్షన్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించినట్లు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
అయినా టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాల్సిందే: డీఈవో
చిత్తూరు సెంట్రల్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మహా శివరాత్రి సందర్భంగా సోమవారం పాఠశాలలకు ఆప్షన్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించినట్లు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలలకు సెలవు దినమైనా, టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. హెచ్‌ఎంలు, సబ్జెక్టు టీచర్లు కచ్చితంగా పాఠశాలకు హాజరై టెన్త్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.