Share News

15 కిలోల క్రేట్లతో వేలం పాట

ABN , Publish Date - Feb 14 , 2026 | 02:15 AM

రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ ఆదేశాలతో మదనపల్లె టమోట మార్కెట్లో 15 కిలోల క్రేట్లతో వేలం పాటలు ప్రారంభించారు.

15 కిలోల క్రేట్లతో వేలం పాట
వేలం ప్రారంభిస్తున్న మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివరామ్‌, డైరెక్టర్లు

మదనపల్లె టౌన్‌, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ ఆదేశాలతో మదనపల్లె టమోట మార్కెట్లో 15 కిలోల క్రేట్లతో వేలం పాటలు ప్రారంభించారు. శుక్రవారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జంగాల శివరామ్‌ ఆధ్వర్యంలో ఎంఆర్‌ మండీ యజమాని మోహన్‌రెడ్డి 15వేల చిన్నక్రేట్లు(15 కిలోలు) కొనుగోలు చేసి రైతులకు అందుబాటులో ఉంచారు. రైతులు ఈ చిన్నక్రేట్లలో టమోటా గ్రేడింగ్‌ చేయగా, వేలం పాటలు నిర్వహించారు. శివరామ్‌ మాట్లాడుతూ చిన్నక్రేట్లతో రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందని, టమోట ధరలు పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఆంజినేయులు, డైరెక్టర్లు చల్లా నరసింహులు, నాగయ్య, జిలానీబాషా, డ్యాన్స్‌ రెడ్డెప్ప, సుబ్రమణ్యంరెడ్డి, మండీ అసోసియేషన్‌ అధ్యక్షుడు సురేంద్ర, జేకే వర్మ పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 02:15 AM