Share News

వైభవంగా ప్రదోష కాల పూజలు

ABN , Publish Date - Feb 15 , 2026 | 01:12 AM

స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న మరగదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి గుడిలో ప్రదోష కాల పూజలను శనివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా ప్రదోష కాల పూజలు
మహానందికి అభిషేకం నిర్వహిస్తున్న అర్చకుడు

ఐరాల(కాణిపాకం), ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న మరగదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి గుడిలో ప్రదోష కాల పూజలను శనివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. మూల విరాట్‌కుకు, స్వామికి ఎదురుగా ఉన్న మహానందికి ఏకకాలంలో అభిషేకం చేశారు. ఈ పూజలను తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు కాణిపాకం క్షేత్రానికి విచ్చేశారు. అభిషేకం పూర్తయిన వెంటనే మూల విరాట్‌ను, మహానందిని అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో పెంచలకిషోర్‌, ప్రధాన అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్‌, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, అర్చక, పండితులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2026 | 01:13 AM