చిత్తూరు కేంద్రంగా స్ర్కాప్- జీఎస్టీ స్కాం సాగుతున్న విషయం బహిరంగ రహస్యమే. అమాయకుల ఆధార్, పాన్, బ్యాంకు వంటి వివరాలను సేకరించి వారి పేర్లతో జీఎస్టీ రిజిస్ర్టేషన్లు పొందుతారు. వ్యాపారం జరగకపోయినా కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు చూపించి నకిలీ ఇన్‌వాయి్‌సల ద్వారా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు చూపిస్తారు. ఈ వ్యవహారాన్ని చిత్తూరుకు చెందిన ముగ్గురు ముఠాగా మారి నడిపిస్తున్నారు. చిత్తూరు న్యూ కైనకట్టు వీధికి చెందిన ఎం.రెహ్మాన్ ఖాన్‌ను పలమనేరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో ఇప్పటివరకు విడివిడిగా వెలుగులోకి వచ్చిన పలు జీఎస్టీ ఫిర్యాదులు, లావాదేవీల వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై పోలీసులు, జీఎస్టీ అధికారులు లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది. 5నెలల్లో రూ.36 కోట్ల లావాదేవీలు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన లారీడ్రైవర్ సయ్యద్ సమీర్ పేరుతో సుమారు రూ.36 కోట్ల మేర జీఎస్టీ లావాదేవీలు ఐదు నెలల్లో నమోదైనట్లు వెలుగులోకి రావడం ఈ తాజా వ్యవహారానికి కారణమైంది. తనకు తెలియకుండానే తన ఆధార్, పాన్, బ్యాంకు పాస్‌బుక్ వివరాలను ఉపయోగించి ‘ఎస్‌ఎస్ ఎంటర్‌ప్రైజెస్’ పేరుతో జీఎస్టీ రిజిస్ర్టేషన్ పొందారని బాధితుడు పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీ లోడ్ ఇప్పిస్తామని నమ్మించి పత్రాలను తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొనగా.. పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలి మెట్టు అని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు.
పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణలో జిల్లాకు మూడు రాష్ట్రస్థాయి స్వచ్ఛ అవార్డులు వచ్చాయి
మూడేళ్లు.. మూడు దశలు.. రాయలసీమ ఉద్యాన సీమగా మారనుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.లక్ష కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు శుక్రవారం తొలి అడుగు పడింది.
పెళ్లి పేరుతో ఓ ఎంబీబీఎస్ విద్యార్థినిని మోసం చేసిన యువకుడిని తిరుపతి జిల్లా అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలికి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడు.. ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఆపై యువతి పెళ్లి పేరు ఎత్తగానే మతం మారాలంటూ ప్రైవేటు ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు దిగాడు.
రాయలసీమలో గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రూ.లక్ష కోట్లతో రాయలసీమ ఉద్యాన హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రాయలసీమను రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తయారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శుక్రవారం శంకుస్థాపన చేశారు.
రాయలసీమ రైతుకు పట్టుదల ఎక్కువ అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కరవులో ఉన్న నేల నేడు అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందన్నారు.
‘ఆంధ్ర భూమి.. సువర్ణ భూమి.. నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి. రాష్ట్రానికి నేనేం చేయగలనో గైడ్ చేయాలి’ అని సీఎం చంద్రబాబును రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనంత్ అంబానీ కోరారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
వెంకటగిరి జనసంద్రమైంది. గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో ముఖ్య ఘట్టమైన విరూపోత్సవానికి ఇసుకేస్తే రాలని రీతిలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.