Share News

దక్షిణ కైలాసానికి కల్యాణ శోభ

ABN , Publish Date - Feb 18 , 2026 | 01:16 AM

శ్రీకాళహస్తీశ్వరుడి మహాశివరాత్రి ఉత్సవాల్లో బుధవారం తెల్లవారు జామున జరిగే ఆదిదంపతుల కళ్యాణోత్సవానికి మంగళవారం రాత్రి నుంచే సంబరం ప్రారంభమైంది.

దక్షిణ కైలాసానికి కల్యాణ శోభ
ముస్తాబైన పెండ్లిమండపం

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరుడి మహాశివరాత్రి ఉత్సవాల్లో బుధవారం తెల్లవారు జామున జరిగే ఆదిదంపతుల కళ్యాణోత్సవానికి మంగళవారం రాత్రి నుంచే సంబరం ప్రారంభమైంది. శ్రీకాళహస్తి పట్టణంలోని కైకాలవారి పెండ్లిమండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దారు. నెహ్రూవీధిలో, నగరివీధిలో భక్తజనులు, పెళ్లిబృందాలు విడిది చేయడానికి బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆదిదంపతుల కళ్యాణ సమయాన బ్యాలవివాహాలు జరగకుండా గట్టి నిఘా పెట్టారు. పట్టణంలోకి ప్రవేశించే అన్ని దారుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఆ చెక్‌పోస్టుల వద్ద పోలీసులు, ఐసీడీఎస్‌, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు మకాం వేశారు. పట్టణంలోకి వచ్చే పెళ్లి బృందాలను పరిశీలించి మరీ పంపుతున్నారు. కాగా ఆదిదేవుడి పెళ్లికి జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. నాలుగు మాడవీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం వరకు పలుచగా కనిపించిన వీధులు రాత్రికి జనంతో నిండిపోయాయి. బుధవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో కల్యాణం నిర్వహించాలని ఆలయ పండితులు ముహూర్తం నిర్ణయించారు. టీటీడీ సమర్పించిన పట్టువస్త్రాలను ధరించి శ్రీకాళహస్తీశ్వరుడు గజవాహనంపై... జ్ఞానప్రసూనాంబదేవి సింహవాహనం అధిరోహించి పెండ్లిమండపానికి రాత్రి 11గంటల ప్రాంతంలో తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, మేళతాళాలు మోగుతుండగా... పరివారం ముందు నడుస్తుండగా స్వామి అమ్మవార్లు పెండ్లిమండపం వద్దకు చేరుకున్నారు.పార్వతీ పరమేశ్వరుల కల్యాణఘడియలో వివాహం చేసుకునేందుకు పలు జంటలు తరలివచ్చాయి.

పట్టువస్త్రాల సమర్పణ

శివరాత్రి వేడుకల్లో భాగంగా మంగళవారం టీటీడీ, కాణిపాక దేవస్థానాల తరపున శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టువస్త్రాలను సమర్పించారు.ఆలయంలోని అలంకార మండపంలో పట్టువస్త్రాలను అందజేశారు.

Updated Date - Feb 18 , 2026 | 01:17 AM