• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

ప్రశాంతంగా రాష్ట్రపతి పర్యటన

ప్రశాంతంగా రాష్ట్రపతి పర్యటన

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల తిరుమల పర్యటన ప్రశాంతంగా ముగిసింది

‘పద్మావతి’చెంత ప్రథమ పౌరురాలు

‘పద్మావతి’చెంత ప్రథమ పౌరురాలు

ఏడుకొండల స్వామి దర్శనానికి దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపదిముర్ము గురువారం సాయంత్రం జిల్లాకు వచ్చారు. తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమల చేరుకున్న ఆమె.. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

నేడు అమ్మవారికి గజవాహనసేవ

నేడు అమ్మవారికి గజవాహనసేవ

తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి గజవాహన సేవ జరగనుంది. తిరుమలలో శ్రీవారి గరుడసేవకున్న ప్రాముఖ్యత.. తిరుచానూరులో గజవాహనసేవకు ఉంటుంది. తిరుపతి నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గజవాహన సేవ తిలకించేందుకు పెద్దసంఖ్యలో తరలివస్తారు. దీంతో మాడవీధుల్లో ఎలాంటి తొక్కిసలాటలు, తోపులాటలు చోటుచేసుకోకుడా టీటీడీ ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసింది. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ ఆలయ మాడవీధుల్లో గజవాహన సేవ ఏర్పాట్లు పరిశీలించారు. ఎక్కడా భక్తులు ఇబ్బంది పడకుండా పోలీసు, విజిలెన్సు సమన్వయంతో పనిచేయాలన్నారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రతిరోజు వాహన సేవలు రాత్రి 9 గంటలకు ముగిస్తే, గజ, గరుడ వాహనసేవలకు మాత్రం రాత్రి 11గంటల వరకు వాహనసేవ కొనసాగే అవకాశం ఉంది. తిరుమల నుంచి లక్ష్మీకాసుల హారం రాక గజవాహన సేవ నేపథ్యంలో అమ్మవారికి అలంకరించేందుకు తిరుమలలో శ్రీవారికి అలంకరించే సహస్ర లక్ష్మీకాసుల హారాన్ని శుక్రవారం ఉదయం తీసుకురానున్నారు. ఈ హారాన్ని శోభాయాత్రగా తీసుకొచ్చి.. గజవాహన సేవలో అమ్మవారికి అలంకరిస్తారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లో 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని ఒక షెడ్‌లో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం హుండీ ఆదాయం: రూ.4.75 కోట్లు బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 67,121 తలనీలాలు సమర్పించినవారు: 22,426

మహిళా వ్యాపారవేత్తలకు   రోల్‌ మోడల్‌గా కుప్పం మహిళ

మహిళా వ్యాపారవేత్తలకు రోల్‌ మోడల్‌గా కుప్పం మహిళ

మహిళా వ్యాపారవేత్తలకు రోల్‌ మోడల్‌గా కుప్పం మహిళ నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కుప్పంలో డ్రాక్రా మహిళలకోసం నెలకొల్పనున్న చాయ్‌ రాస్తా అవుట్‌లెట్‌ లోగోను గురువారం ఆమె ఆవిష్కరించారు.ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ కుప్పం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంలో భాగంగా చాయ్‌ రాస్తా రూపొందుతున్నదన్నారు. రుచి, శుచి, నాణ్యత ప్రధానంగా కార్పొరేట్‌ తరహాలో ఏర్పాటు చేయనున్న చాయ్‌ రాస్తా లే అవుట్‌ను కుప్పంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీనిద్వారా డ్వాక్రా మహిళలకు ప్రతినెలా స్థిరాదాయం లభించడంతోపాటు గౌరవం కల్పించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. మెప్మా భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లో చాయ్‌ రాస్తా ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చనున్నామన్నారు. మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ఇటువంటి అధునాతన వ్యాపారాలు ఎంతో దోహపదపడతాయన్నారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు చాయ్‌ రాస్తా చక్కటి అవకాశమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, కడా పీడీ వికాస్‌ మర్మత్‌ అన్నారు. కుప్పంతోపాటు చిత్తూరు, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో సైతం త్వరలోనే తమ అవుట్‌లెట్‌లు ప్రారంభించనున్నట్లు చాయ్‌ రాస్తా సీఈవో మైకేల్‌ జోషి చెప్పారు. ఈ కార్యక్రమంలో చాయ్‌ రాస్తా డైరెక్టర్లు పి.కిరణ్‌, ఒ.పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

టైగర్‌ రొయ్యకు ‘వైట్‌స్పాట్‌’

టైగర్‌ రొయ్యకు ‘వైట్‌స్పాట్‌’

వైట్‌స్పాట్‌ వైరస్‌ ఆక్వా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రొయ్యలను పట్టేసి విక్రయిద్దామనుకుంటున్న తరుణంలో అల్పపీడన ద్రోణి కారణంగా విపరీతమైన చలితో పాటు మంచు కురుస్తోంది. అదే సమయంలో వైట్‌స్పాట్‌ వైర్‌సతో రొయ్యలు మృత్యువాత పడుతుండటంతో ఆక్వా రైతులు విలవిలలాడుతున్నారు. సముద్రతీర ప్రాంతాలైన చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో టైగర్‌, వెనామి రొయ్యల పెంపకం చేపట్టారు. వాతావరణంలో మార్పులు, విపరీతమైన మంచు కురుస్తుండటంతో టైగర్‌ రొయ్యలకు వైట్‌స్పాట్‌ సోకుతోంది. నీటిలో ఉన్న రొయ్యలకు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండాలి. ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల 11 నుంచి 12 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోవడంతో రొయ్యలు వైరస్‌ బారిన పడుతున్నాయి. దీంతో రొయ్యలు మేత తినకుండా బరువు తగ్గి చనిపోతున్నట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా కోట మండలంలోని వావిళ్ల దొరువు, శ్రీనివాససత్రం, దొరువుకట్ట, ఉత్తమనెల్లూరు గ్రామాల్లో వైట్‌స్పాట్‌ ఉన్నట్లు రైతులు చెబుతున్నారు.

సమగ్ర శిక్ష ఏపీసీగా మహిళా వర్సిటీ

సమగ్ర శిక్ష ఏపీసీగా మహిళా వర్సిటీ

విద్యా శాఖలో సమగ్ర శిక్షా విభాగం అదనపు ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌గా తిరుపతి పద్మావతీ మహిళా వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నున్నం అనురాధ నియమితులయ్యారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది జిల్లాలకు వేర్వేరు శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న అధికారులను డెప్యుటేషన్‌పై సమగ్ర శిక్షా ఏపీసీలుగా నియమించింది. అందులో భాగంగా స్థానిక మహిళా వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అనురాధను డెప్యుటేషన్‌పై అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా ఏపీసీగా నియమించింది. ఈ పోస్టులో ప్రాథమికంగా ఏడాదిపాటు కొనసాగనున్నారు.

విద్యార్థులకు రవాణా భత్యం విడుదల

విద్యార్థులకు రవాణా భత్యం విడుదల

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే అర్హులైన విద్యార్థులకు రవాణా భత్యాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్లు డీఈవో కేవీఎన్‌ కుమార్‌ గురువారం తెలిపారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ప్రాథమిక పాఠశాలలకు ఒక కిలోమీటరు దూరం, ప్రాథమిక పాఠశాలలకు 3 కిలోమీటర్లు, ఉన్నత పాఠశాలలకు 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు సంవత్సరానికి రూ.6 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఆమేరకు 6,752 మంది విద్యార్థులను విద్యాశాఖ గుర్తించింది. వీరికి మొదటి విడతగా రూ.2,02,56,000 ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసినట్టు డీఈవో తెలిపారు.

President Droupadi Murmu: తిరుమల చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu: తిరుమల చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

తిరుచానూరు, తిరుమలలో రాష్ట్రపతి ముర్ము పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Nara Bhuvaneshwari: కుప్పం ప్రజలకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari: కుప్పం ప్రజలకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి

డీకే పల్లి వద్ద కృష్ణా జలాలకు నారా భువనేశ్వరి జల హారతి ఇచ్చారు. అంతకు ముందు గంగమ్మ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణమ్మకు చీర సారె అందించడం తన పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి