100 రోజుల ప్రణాళికలో జిల్లాకు 5వ స్థానం
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:17 AM
టెన్త్ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమల్లో జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. డిసెంబరు ఒకటిన మొదలైన ఈ కార్యక్రమం మంగళవారానికి 67 రోజులు పూర్తి చేసుకుంది. 65 రోజుల పురోగతి నివేదికను రాష్ట్ర విద్యాశాఖ సోమవారం సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన థర్డ్ మినిస్టర్స్, సెక్రటరీ కాన్ఫరెన్స్‌లో సమర్పించింది. ‘సీ’ గ్రేడే ఎక్కువ జిల్లాలోని 353 ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలల్లో 15,812 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ప్రతి రోజూ ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా స్లిప్ టెస్టులు పెట్టి, మూల్యాకనం చేసి, మార్కులను విద్యాశాఖ రూపొందించిన యాప్‌లో పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం టెన్త్ విద్యార్థులకు ప్రీ-ఫైనల్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల గ్రేడింగ్‌కు సంబంధించి వివరాలను వెల్లడించింది. ఏ గ్రేడ్ (80-100 మార్కులు)లో 1,145 మంది, బీ గ్రేడ్ (60-79 మార్కులు)లో 3991, సీ గ్రేడ్ (35-59 మార్కులు)లో 7027 మంది, డీ గ్రేడ్ (35 మార్కులు)లో 3030 మంది విద్యార్థులు ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. డీ గ్రేడ్‌పై దృష్టి సారిస్తారా? వంద రోజుల కార్యక్రమం ముగియడానికి 33 రోజులే ఉంది. దీంతో డీ గ్రేడ్‌లోని 3030 మంది విద్యార్థులను కనీసం పాస్ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా వెనకబడిన విద్యార్థులకు నైట్ విజన్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని డీఈవో రాజేంద్రప్రసాద్ ఇటీవల ప్రకటించారు. ఇది పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఫలితాలు మెరుగుపడే అవకాశం లేకపోలేదు.
జీ-ఎ్‌ఫఎల్‌ఎన్‌లో మాత్రం వెనుకబాటు
రాష్ట్ర విద్యాశాఖ నివేదిక
చిత్తూరు సెంట్రల్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): టెన్త్ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమల్లో జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. డిసెంబరు ఒకటిన మొదలైన ఈ కార్యక్రమం మంగళవారానికి 67 రోజులు పూర్తి చేసుకుంది. 65 రోజుల పురోగతి నివేదికను రాష్ట్ర విద్యాశాఖ సోమవారం సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన థర్డ్ మినిస్టర్స్, సెక్రటరీ కాన్ఫరెన్స్‌లో సమర్పించింది.
‘సీ’ గ్రేడే ఎక్కువ
జిల్లాలోని 353 ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలల్లో 15,812 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ప్రతి రోజూ ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా స్లిప్ టెస్టులు పెట్టి, మూల్యాకనం చేసి, మార్కులను విద్యాశాఖ రూపొందించిన యాప్‌లో పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం టెన్త్ విద్యార్థులకు ప్రీ-ఫైనల్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల గ్రేడింగ్‌కు సంబంధించి వివరాలను వెల్లడించింది. ఏ గ్రేడ్ (80-100 మార్కులు)లో 1,145 మంది, బీ గ్రేడ్ (60-79 మార్కులు)లో 3991, సీ గ్రేడ్ (35-59 మార్కులు)లో 7027 మంది, డీ గ్రేడ్ (35 మార్కులు)లో 3030 మంది విద్యార్థులు ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది.
డీ గ్రేడ్‌పై దృష్టి సారిస్తారా?
వంద రోజుల కార్యక్రమం ముగియడానికి 33 రోజులే ఉంది. దీంతో డీ గ్రేడ్‌లోని 3030 మంది విద్యార్థులను కనీసం పాస్ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా వెనకబడిన విద్యార్థులకు నైట్ విజన్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని డీఈవో రాజేంద్రప్రసాద్ ఇటీవల ప్రకటించారు. ఇది పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఫలితాలు మెరుగుపడే అవకాశం లేకపోలేదు.
జీ-ఎ్‌ఫఎల్‌ఎన్‌లో 22వ స్థానం
ఒకటి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 61,096 మందికి 75 రోజుల పాటు నిర్వహిస్తున్న గ్యారెంటీ-ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (జీ-ఎ్‌ఫఎల్‌ఎన్) కార్యక్రమం మంగళవారం నాటికి 42 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్ర విద్యాశాఖ సమర్పించిన 40 రోజుల నివేదికలో జిల్లా 22వ స్థానంలో ఉంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఇంగ్లీషు, తెలుగు, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఆయా సబ్జెక్టుల్లో వీరు చూపిన ప్రతిభ ఆధారంగా ‘స్కై’ (70 మార్కులు)గా, ‘మౌంటేన్’ (41-70 మార్కులు)గా, ‘స్ట్రీం’ (40 మార్కులు)గా విభజించారు. విద్యార్థులు ఇంగ్లీ్‌షలో పూర్‌గా ఉన్నట్లు నివేదిక వెల్లడిస్తోంది.
ఫ స్కై విభాగం ఇంగ్లీషులో 41 శాతం, తెలుగులో 51 శాతం, మ్యాథమెటిక్స్‌లో 65 శాతం మంది ఉన్నారు.
ఫ మౌంటేన్ విభాగంలో 39, 28, 19 శాతాలు చొప్పున.. స్ట్రీం విభాగం ఇంగ్లీషులో 19 శాతం ఉండగా, తెలుగులో 16, మ్యాథమెటిక్స్‌లో 15 శాతం ఉన్నారు.
ఎందుకు వెనుకబడినట్లు?
జీ-ఎ్‌ఫఎల్‌ఎన్ కార్యక్రమంలో వెనుకబడటానికి కారణాలు చాలానే ఉన్నాయి. గత నెల 20న చిత్తూరులో ఆర్జేడీ శ్యామూల్ ఉమ్మడి జిల్లా ఎంఈవోల సమావేశం నిర్వహించారు. స్కై, మౌంటేన్, స్ట్రీం.. పదాలకు అర్థం చెప్పమని ఎంఈవోలను అడగ్గా, ఒకరిద్దరు తప్ప చాలా మంది చెప్పలేకపోయారు. మరో వైపు ఈ కార్యక్రమాన్ని పాఠశాల స్థాయిలో టీచర్లు ఎలా నిర్వహిస్తున్నారనే దానిపై విద్యాశాఖ, సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది. కార్యక్రమం ముగియడానికి కేవలం 33 రోజులే ఉంది. అప్పటికైనా ర్యాంకు మెరుగుపడేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది.