Share News

ఆగమోక్తం.... కన్నప్ప ధ్వజారోహణం

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:26 AM

శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాలకు కన్నప్ప ధ్వజారోహణంతో మంగళవారం సాయంత్రం ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. భక్తుడికి కొండపై స్థానం కల్పించి తొలి పూజను కూడా అతనికే చెందేలా వరమిచ్చిన వాయులింగేశ్వర స్వామి ఉత్సవాల ధ్వజారోహణ మహోత్సవం అంగ రంగ వైభవంగా జరిగింది. అంతకు ముందు ముక్కంటి ఆలయంలో పూజలు నిర్వహించారు. కన్నప్ప ఉత్సవమూర్తిని స్వర్ణా భరణాలతో అలంకరించారు.అభిషేక పూజలు నిర్వహించాక మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ కన్నప్ప కొండపైకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆలయం ఎదుట ఉత్సవమూర్తిని కొలువుదీర్చారు. ముక్కోటి దేవతలకు సంకల్ప పూజలతో వేదపండితులు ఉత్సవాలకు శాస్త్రోక్తంగా ఆహ్వానం పలికారు. ధ్వజారోహణ క్రతువులో భాగంగా కన్నప్ప ధ్వజస్తంభానికి పూజలు చేశారు. అనంతరం దర్బ, మామిడి ఆకులతో కట్టిన తెల్లదారంతో ధవళపతాకం, పూలహారాన్ని ఎగురవేసి హారతులను సమర్పించి ఉత్సవాలకు అంకురార్పణ పలికారు. అనంతరం కన్నప్ప ఉత్సవమూర్తిని ముక్కంటి ఆలయం వద్దకు తీసుకొచ్చారు. సన్నిధి వీధిలో బోయ కులస్థులు ఏర్పాటు. చేసిన విడిది మండపంలో కొలువుదీర్చారు. సాంప్రదాయం ప్రకారం ఉభయదారులైన బోయలు వస్త్రం, నైవేద్యం సమర్పించాక గ్రామోత్సవం ప్రారంభమైంది. రాజగోపురం వద్ద నుంచి చతుర్మాడ వీధుల్లో కన్నప్ప గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఽఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఆలయ చైర్మన్‌ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి, ధర్మకర్తలమండలి సభ్యులు, బీజేపీ నాయకులు కోలా ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైల ఆలయం తరపున పట్టువస్త్రాల సమర్పణ

ఆగమోక్తం.... కన్నప్ప ధ్వజారోహణం

  • వాయులింగేశ్వరుడి శివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాలకు కన్నప్ప ధ్వజారోహణంతో మంగళవారం సాయంత్రం ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. భక్తుడికి కొండపై స్థానం కల్పించి తొలి పూజను కూడా అతనికే చెందేలా వరమిచ్చిన వాయులింగేశ్వర స్వామి ఉత్సవాల ధ్వజారోహణ మహోత్సవం అంగ రంగ వైభవంగా జరిగింది. అంతకు ముందు ముక్కంటి ఆలయంలో పూజలు నిర్వహించారు. కన్నప్ప ఉత్సవమూర్తిని స్వర్ణా భరణాలతో అలంకరించారు.అభిషేక పూజలు నిర్వహించాక మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ కన్నప్ప కొండపైకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆలయం ఎదుట ఉత్సవమూర్తిని కొలువుదీర్చారు. ముక్కోటి దేవతలకు సంకల్ప పూజలతో వేదపండితులు ఉత్సవాలకు శాస్త్రోక్తంగా ఆహ్వానం పలికారు. ధ్వజారోహణ క్రతువులో భాగంగా కన్నప్ప ధ్వజస్తంభానికి పూజలు చేశారు. అనంతరం దర్బ, మామిడి ఆకులతో కట్టిన తెల్లదారంతో ధవళపతాకం, పూలహారాన్ని

ఎగురవేసి హారతులను సమర్పించి ఉత్సవాలకు అంకురార్పణ పలికారు. అనంతరం కన్నప్ప ఉత్సవమూర్తిని ముక్కంటి ఆలయం వద్దకు తీసుకొచ్చారు. సన్నిధి వీధిలో బోయ కులస్థులు ఏర్పాటు. చేసిన విడిది మండపంలో కొలువుదీర్చారు. సాంప్రదాయం ప్రకారం ఉభయదారులైన బోయలు వస్త్రం, నైవేద్యం సమర్పించాక గ్రామోత్సవం ప్రారంభమైంది. రాజగోపురం వద్ద నుంచి చతుర్మాడ వీధుల్లో కన్నప్ప గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఽఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఆలయ చైర్మన్‌ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి, ధర్మకర్తలమండలి సభ్యులు, బీజేపీ నాయకులు కోలా ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైల ఆలయం తరపున పట్టువస్త్రాల సమర్పణ

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం ఆలయం తరపున మంగళవారం స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోని అలంకార మండంపానికి శ్రీశైలం ఆలయ ఈవో చేరుకున్నారు. అక్కడ వేదపండితులకు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

సాంస్కృతికోత్సవాలు ప్రారంభం

శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ధూర్జటి కళాప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.సినీ దర్శకుడు అనిల్‌ రావిపూడి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు.

Updated Date - Feb 11 , 2026 | 02:26 AM