Share News

ఆరు నెలల్లో రూ. 3.68 లక్షలు

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:22 AM

టీటీడీకి వెళ్ళే నెయ్యి ట్యాంకర్ల వద్ద లంచాలు తీసుకున్న తిరుచానూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉద్యోగి తంబూరు రాధాకృష్ణను ఉద్యోగం నుంచి తొలగించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరు నెలల వ్యవధిలోనే టీటీడీకి భోలేబాబా డెయిరీ సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్ల నుంచీ ఏకంగా రూ. 3.68 లక్షలు లంచంగా వసూలు చేశాడీ ఘనుడీయన. సిట్‌ అధికారులు కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో భాగంగా భోలేబాబా డెయిరీకి కమీషన్‌ ఏజెంట్‌గా పనిచేసిన పీపీ శ్రీనివాసన్‌ను ప్రశ్నించడంతో పాటు అతడి వద్ద డెయిరీలు, పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అతడి వద్ద లభించిన ఒక డైరీలో తిరుచానూరు మార్కెట్‌ కమిటీలో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వాచ్‌మెన్‌గా పనిచేసే తంబూరు రాధాకృష్ణకు అలిపిరి చెక్‌ పోస్టు వద్ద రూ. 3.68 లక్షలు లంచం ముట్టజెప్పిట్టు నమోదై వుంది. అది కూడా 2023 ఫిబ్రవరి 27 నుంచీ సెప్టెంబరు 11వ తేదీ వరకూ అంటే ఆరు నెలల వ్యవధిలో ఈ మొత్తాన్ని అతడికి లంచంగా ఇచ్చినట్టు నమోదై వుంది. ఆ లెక్కన టీటీడీకి వెళ్ళే ఇతర డెయిరీలకు చెందిన నెయ్యి ట్యాంకర్ల నుంచీ కూడా తప్పకుండా లంచాలు వసూలు చేసివుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.15 ఏళ్ళుగా అతడు కమిటీలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆ లెక్కన ఇతర చోట్ల, చెక్‌పోస్టుల్లో వేర్వేరు వ్యవసాయ ఉత్పత్తులు తరలించే వాహనాల నుంచీ ఎంతెంత వసూలు చేసివుంటాడోనన్న చర్చ నడుస్తోంది.

ఆరు నెలల్లో రూ. 3.68 లక్షలు

-టీటీడీకి వచ్చే నెయ్యి ట్యాంకర్ల నుంచి

చిరుద్యోగి లంచాలపర్వం

-తిరుచానూరు కమిటీ ఔట్‌

సోర్సింగ్‌ ఉద్యోగి నిర్వాకం

తిరుపతి, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): టీటీడీకి వెళ్ళే నెయ్యి ట్యాంకర్ల వద్ద లంచాలు తీసుకున్న తిరుచానూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉద్యోగి తంబూరు రాధాకృష్ణను ఉద్యోగం నుంచి తొలగించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరు నెలల వ్యవధిలోనే టీటీడీకి భోలేబాబా డెయిరీ సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్ల నుంచీ ఏకంగా రూ. 3.68 లక్షలు లంచంగా వసూలు చేశాడీ ఘనుడీయన. సిట్‌ అధికారులు కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో భాగంగా భోలేబాబా డెయిరీకి కమీషన్‌ ఏజెంట్‌గా పనిచేసిన పీపీ శ్రీనివాసన్‌ను ప్రశ్నించడంతో పాటు అతడి వద్ద డెయిరీలు, పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అతడి వద్ద లభించిన ఒక డైరీలో తిరుచానూరు మార్కెట్‌ కమిటీలో ఔట్‌సోర్సింగ్‌

ప్రాతిపదికన వాచ్‌మెన్‌గా పనిచేసే తంబూరు రాధాకృష్ణకు అలిపిరి చెక్‌ పోస్టు వద్ద రూ. 3.68 లక్షలు లంచం ముట్టజెప్పిట్టు నమోదై వుంది. అది కూడా 2023 ఫిబ్రవరి 27 నుంచీ సెప్టెంబరు 11వ తేదీ వరకూ అంటే ఆరు నెలల వ్యవధిలో ఈ మొత్తాన్ని అతడికి లంచంగా ఇచ్చినట్టు నమోదై వుంది. ఆ లెక్కన టీటీడీకి వెళ్ళే ఇతర డెయిరీలకు చెందిన నెయ్యి ట్యాంకర్ల నుంచీ కూడా తప్పకుండా లంచాలు వసూలు చేసివుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.15 ఏళ్ళుగా అతడు కమిటీలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆ లెక్కన ఇతర చోట్ల, చెక్‌పోస్టుల్లో వేర్వేరు వ్యవసాయ ఉత్పత్తులు తరలించే వాహనాల నుంచీ

ఎంతెంత వసూలు చేసివుంటాడోనన్న చర్చ నడుస్తోంది.

అలిపిరిలో చెక్‌పోస్టే లేకుండా వసూళ్ళు

తిరుచానూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి ఒకే ఒక చెక్‌పోస్టు వుంది. అది కూడా తిరుపతి శివార్లలోని అగ్రహారం (ఉప్పరపల్లి క్రాస్‌) వద్ద వుంది. అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద కమిటీకి చెక్‌పోస్టు లేదు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే ట్యాంకర్లు అనేక రాష్ట్రాల నుంచీ తిరుమలకు వస్తాయి. డెయిరీలున్న కమిటీల పరిధిలో గానీ, లేదా మార్గమధ్యంలో ఏ చెక్‌పోస్టులోనైనా గానీ సెస్‌ చెల్లించే అవకాశముంది. ఒకచోట సెస్‌ చెల్లించి రశీదు తీసుకుంటే దాన్ని చూపి తదుపరి చెక్‌పోస్టులన్నీ దాటే అవకాశముంది. ఆ లెక్కన భోలేబాబా డెయిరీ ట్యాంకర్లు తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలం పునబాక వద్ద వైష్ణవి డెయిరీ మీదుగా తిరుమల వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ మార్గంలో నాయుడుపేట, శ్రీకాళహస్తి మార్కెట్‌ కమిటీల పరిధి

దాటి రావాలి. అవి దాటితే తర్వాత తిరుమల చేరే దాకా మార్గమధ్యంలో చెక్‌పోస్టులు లేవు. నాయుడుపేట, శ్రీకాళహస్తి కమిటీల పరిధిలో ఎక్కడైనా సెస్‌ చెల్లించి వుంటే అలిపిరి వద్ద ఎవరు డిమాండ్‌ చేసినా సెస్‌ చెల్లించనక్కర లేదు. చెక్‌పోస్టే లేనిచోట ఓ చిరుద్యోగి ఏకంగా టీటీడీకి వెళ్ళే ట్యాంకర్లను అడ్డగించి లక్షలు వసూలు చేయడం సంచలనంగా మారింది.

నాయుడుపేట కమిటీ సహాయ కార్యదర్శిపైనా విచారణ

సిట్‌ నివేదిక ఆధారంగా నాయుడుపేట మార్కెట్‌ కమిటీ సహాయ కార్యదర్శిపై కూడా ఆ శాఖ విచారణ చేపట్టింది. భోలేబాబా డెయిరీకి సంబంధించిన లారీకి నెయ్యి సరఫరా కోసం పర్మిట్‌ ఇచ్చేందుకు 2023 సెప్టెంబరు 15వ తేదీన నాయుడుపేట కమిటీ సహాయ కార్యదర్శి ఇ.ఆర్‌.బాషా రూ. 10,100 లంచం తీసుకున్నట్టు వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖకు సిట్‌ సమాచారం ఇచ్చింది. అయితే కమిటీలో ఆ సమయంలో సహాయ కార్యదర్శిగా ఇలియాస్‌ బాషా అనే వ్యక్తి పనిచేశారు. భోలేబాబా డెయిరీ లారీకి పర్మిట్‌ జారీ చేసింది ఆయనే. ప్రస్తుతం ఇలియాస్‌ బాషా నెల్లూరు జిల్లా కావలి మార్కెట్‌ కమిటీలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సిట్‌ నివేదిక

ఆధారంగా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది.

Updated Date - Feb 11 , 2026 | 02:22 AM