ఇక పర్యవేక్షణ పటిష్టం
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:24 AM
గ్రామ, వార్డు సచివాలయాలను ఆ మధ్య ప్రభుత్వం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలుగా పేర్లను మార్చింది. ఈ కార్యాలయాలకు నిర్దిష్ట పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో కార్యాయాల సిబ్బందిని పర్యవేక్షించేందుకు మూడంచెల వ్యవస్థను రూపొందించింది.ఇక నుంచి జడ్పీ సీఈవో స్థాయి అధికారిని ‘జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల అధికారి’గా నియమించనున్నారు. అలాగే మున్సిపాలిటీల్లో అడిషనల్ కమిషనర్ ‘అర్బన్ స్వర్ణ వార్డు అధికారి’గా.. మండలాల్లో డిప్యూటీ ఎంపీడీవో ‘మండల స్వర్ణ గ్రామ అధికారి’గా పనిచేస్తారు. వీరికి ఇద్దరు చొప్పున సచివాలయ ఉద్యోగులు అసిస్టెంట్లుగా ఉంటారు.జిల్లా అధికారి జిల్లాలోని స్వర్ణ కార్యాలయాలకు సంబంధించి పూర్తి పర్యవేక్షణ బాధ్యతతో పాటు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను స్వర్ణ కార్యాలయాల ద్వారా అమలు చేసేందుకు బాధ్యత తీసుకుంటారు. సిబ్బందిపై వచ్చే ఫిర్యాదులపై విచారణ చేపట్టి నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తారు.
స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు ప్రత్యేకాధికారులు
జిల్లా స్థాయిలో జడ్పీ సీఈవో ర్యాంకు
మున్సిపాలిటీల్లో అడిషనల్ కమిషనర్, మండలాల్లో డిప్యూటీ ఎంపీడీవో
మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
చిత్తూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాలను ఆ మధ్య ప్రభుత్వం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలుగా పేర్లను మార్చింది. ఈ కార్యాలయాలకు నిర్దిష్ట పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో కార్యాయాల సిబ్బందిని పర్యవేక్షించేందుకు మూడంచెల వ్యవస్థను రూపొందించింది.ఇక నుంచి జడ్పీ సీఈవో స్థాయి అధికారిని ‘జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల అధికారి’గా నియమించనున్నారు. అలాగే మున్సిపాలిటీల్లో అడిషనల్ కమిషనర్ ‘అర్బన్ స్వర్ణ వార్డు అధికారి’గా.. మండలాల్లో డిప్యూటీ ఎంపీడీవో ‘మండల స్వర్ణ గ్రామ అధికారి’గా పనిచేస్తారు. వీరికి ఇద్దరు చొప్పున సచివాలయ ఉద్యోగులు అసిస్టెంట్లుగా ఉంటారు.జిల్లా అధికారి జిల్లాలోని స్వర్ణ కార్యాలయాలకు సంబంధించి
పూర్తి పర్యవేక్షణ బాధ్యతతో పాటు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను స్వర్ణ కార్యాలయాల ద్వారా అమలు చేసేందుకు బాధ్యత తీసుకుంటారు. సిబ్బందిపై వచ్చే ఫిర్యాదులపై విచారణ చేపట్టి నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తారు.