• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం 

తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం 

తిరుపతి జిల్లాలోని తొట్టంబేడు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదంతో రైతు మునిరాజా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఏనుగుల జలకాలాట

ఏనుగుల జలకాలాట

బంగారుపాళ్యం మండలం మొగిలి కౌండిన్య అభయారణ్యంలో రెండు వారాల నుంచి ఏనుగుల గుంపు తిష్టవేశాయి. గురువారం సాయంత్రం మొగిలి సమీపంలోని గౌనివానిచెరువులో సుమారు 15 ఏనుగుల గుంపు జలకాలాడాయి.

జీవిత ఖైదీలకే పనులు

జీవిత ఖైదీలకే పనులు

పలమనేరులో జైళ్ల శాఖ ఆధ్వర్యంలోని పెట్రోల్‌ బంకులో పనిచేస్తూ.. జీవిత ఖైదీ సూరి పరారయ్యాడు. ఈ క్రమంలో ఖైదీల్లో ఎవరికి ఇలాంటి పనులు అప్పగిస్తారు? పర్యవేక్షణ ఎలా ఉంటుందనేది పరిశీలిస్తే.. జీవిత ఖైదీగా జైలు శిక్ష అనుభవిస్తూ.. సత్ప్రవర్తన కలిగిన వారికే ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.

రిటైర్డు ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ

రిటైర్డు ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ

మదనపల్లెలో బుధవారం అర్థరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు రిటైర్డు ఉద్యోగి ఇంట్లోకి ప్రవేశించి రూ.30లక్షల బంగారు, వెండి నగలు చోరీ చేశారు.

గొంతెండి...అడవిని వీడి..

గొంతెండి...అడవిని వీడి..

వర్షాభావానికి అడవి జంతువులు అల్లాడిపోతున్నాయి. కనుచూపు మేర నీరు లేక దాహం తీరేదారి లేక అలమటిస్తున్నాయి. ఎల్‌నీనో ప్రభావంతో మునుపెన్నడూ లేని విధంగా అడవుల్లోని జల వనరులు ఒట్టిపోయాయి. వేసవి తర్వాత ఎల్‌నీనో ప్రభావంతో జూన్‌ నుంచి ఇప్పటికి వరకు పెద్దగా వర్షాలు పడటంలేదు. దీంతో ఆడవుల్లో తాగునీటికి, మేతకు కొరత ఏర్పడటంతో అడవి జంతువులు క్టిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.

ఎలా తప్పించుకున్నాడు?

ఎలా తప్పించుకున్నాడు?

ఎవరైనా దగ్గరుండి తీసుకెళ్లారా? లేదా అతడే ప్లాన్‌ ప్రకారం తప్పించుకుని వెళ్లాడా? పలమనేరు పట్టణం నుంచి ఎలా బయటపడ్డాడు? ఎక్కడకు చేరుకున్నాడు? వీరిపై జైలు వార్డర్ల నిఘా ఏమైంది? జైలులో అధికారుల వద్ద సత్ప్రవర్తనతో ఉన్నట్లు నటించాడా? జైళ్లశాఖ ఆధ్వర్యంలోని పెట్రోల్‌ బంకులో పనిచేస్తూ తప్పించుకున్న జీవిత ఖైదీ సూర్య అలియాస్‌ సూరి విషయంలో ఇవి సమాధానాల్లేని ప్రశ్నలుగా మిగిలాయి.

జీడీనెల్లూరులో భారీగా రీసర్వే అక్రమాలు

జీడీనెల్లూరులో భారీగా రీసర్వే అక్రమాలు

జీడీనెల్లూరు మండలం కొట్రకోన గ్రామంలో వైసీపీ హయాంలో చేపట్టిన రీసర్వేలో భారీగా అవకతవకలు బయటపడ్డాయి. రీసర్వే తర్వాత తయారుచేసిన డ్రాఫ్ట్‌ ఆర్వోఆర్‌ను పాత రికార్డులతో పోల్చితే.. అసైన్డ్‌ భూముల నమోదు, పట్టాల మార్పిడి, ప్రభుత్వ భూముల విస్తీర్ణం తగ్గించి డీకేటీ భూములుగా నమోదు చేయడం, పట్టా భూముల ఖాతాల్లో విస్తీర్ణ వ్యత్యాసాలు తదితర అంశాల్ని అధికారులు గుర్తించారు.

 అలిపిరి తనిఖీ కేంద్రంలో రద్దీ తగ్గింది

అలిపిరి తనిఖీ కేంద్రంలో రద్దీ తగ్గింది

కొద్దిరోజులుగా వాహనాలతో కిటకిటలాడుతున్న అలిపిరి తనిఖీ కేంద్రం గురువారం ఇలా నిర్మానుష్యంగా కనిపించింది.ఇటీవల సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిన క్రమంలో నిత్యం దాదాపు 10 వేల వాహనాలు కొండకు చేరుకుంటున్న విషయం తెలిసిందే.

దర్యాప్తునకు సహకరించండి

దర్యాప్తునకు సహకరించండి

ఆమోదం పొందిన లేఅవుట్‌లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా మామిడి చెట్లు తొలగించి సొంత భూమికి రోడ్డు ఏర్పాటు చేసుకున్న వ్యవహారంపై నమోదైన కేసులో దర్యాప్తునకు సహకరించాలని వైసీపీ నాయకుడు భూమన కరుణాకర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను హైకోర్టు ఆదేశించింది.

 ప్రొసీడింగ్స్‌ ఇస్తేనే ‘పంచాయతీ’ తీరేది!

ప్రొసీడింగ్స్‌ ఇస్తేనే ‘పంచాయతీ’ తీరేది!

పంచాయతీల్లో ఇళ్లు కొనుక్కుంటున్నారా.... అయితే మీ పేరుతో ఆ ఇల్లు మ్యుటేషన్‌ (పేరు మార్పు) చేసుకోవాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు ఆగాల్సిందే..... కొత్త ఆర్థిక సంవత్సరం వస్తే తప్ప తాము డిమాండ్‌ నోటీసులు (ఇంటి పన్ను రసీదులు) జారీ చేయలేమని, అప్పుడు మాత్రమే మ్యుటేషన్‌ చేసుకునేందుకు అవకాశం ఉందని పంచాయతీ సిబ్బంది చెబుతున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి