ఇంట్లో మీ కోసం ఎదురుచూస్తుంటారు
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:26 AM
సురక్షితంగా ప్రయాణించండి. మీకోసం ఇంట్లో ఎదురు చూస్తుంటారు’
చిత్తూరు అర్బన్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ‘సురక్షితంగా ప్రయాణించండి. మీకోసం ఇంట్లో ఎదురు చూస్తుంటారు’ అంటూ పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో జరిగే ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, ఆటోలవేనని గుర్తు చేస్తున్నారు. రోడ్డు భద్రతే ప్రధాన లక్ష్యమని ఎస్పీ తుషార్ డూడీ వెల్లడించారు. చిత్తూరులోని గాంధీ సర్కిల్ వద్ద గురువారం హెల్మెట్ ధారణపై పోలీసుశాఖ తయారు చేసిన పోస్టర్లను ఎస్పీవ ఆవిష్కరించారు. ఆటోలపై అతికించారు. ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ద్విచక్ర, ఆటో డ్రైవర్లకు ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. హెల్మెట్ ధారణ, రోడ్డు భద్రతపై జరిమానాలతో కాకుండా స్వచ్ఛందంగా మార్పు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్డు భద్రత సమాజంలోని ప్రతిఒక్కరి బాధ్యతని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సాయినాథ్, ఒకటో పట్టణ సీఐ మహేశ్వర, ట్రాఫిక్ సీఐ నిత్యబాబు, ఆటో యూనియన్ నేతలు పాల్గొన్నారు.