సెల్క్షేపం..!Self-destruction..
సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేపట్టింది. ఇందులో బాగంగా పుట్టపర్తి పట్టణం నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు తొమ్మిది పార్కింగ్ స్థలాలను, ఏడు వైద్య శిబిరాలను, ఏడు సమాచార కేంద్రాలను ఏర్పాటుచేసింది.
పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వెండి రథంపై సత్యసాయి బాబా పుట్టపర్తి పురవీధులలో ఊరేగనున్నారు.
సత్యసాయి శత జయంతి వేడుకలకు వచ్చే భక్తులతో పుట్టపర్తి అలరారుతోంది. మహా సమాధిని వేలాది మంది దర్శించుకుంటున్నారు. సాయికుల్వంతు సభా మంటపంలో సోమవారం పండిట్ విశ్వనాథ్ మోహన భట్ బృందం వీణావాయిద్యం భక్తులను అలరించింది.
రాషా్ట్రనికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
దంపతుల మధ్య సమస్య పరిష్కరించడానికి కులపెద్దలు పంచాయితీ చేస్తారట. అందుకు ఏకంగా రూ.10లక్షలు, పది తులాల బంగారం ఇవ్వాలని తీర్మాణం చేశారు. ఈ ఘటన గుంతకల్లులో వెలుగుచూసింది. బాధితురాలు తన సమస్యను చెప్పుకోవడానికి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చింది.
గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని శాఖా గ్రంథాల యంలో సోమవారం గ్రంథాలయ అఽధికారి అంజలిసౌభాగ్యవతి ఆధ్వర్యంలో కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన కవి ప్రపుల్లా చంద్ర, వెంకటేశులు, టీటీడీ ధర్మచారులు కకాకుమాను, రవీంద్ర, గాయకులు నాగరాజులను శాలువాతో ఘనంగా సత్కరించారు. గ్రంఽథాలయాల గురించి పద్యం, కవిత, పాటల ద్వారా వారు విద్యార్థులకు వివరించారు.
స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి సవిత మండల నాయకులకు సూచించారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పెనుకొండ మండల నాయకులతో సమావేశం నిర్వహించారు.
పట్టణంలోని రాజీవ్‌గాంధీ సర్కిల్లో కూరగాయల మార్కెట్ నిర్వహిస్తుండటంతో వాహనాలు అన్నీ రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు. సంతరోజు ద్విచక్ర వాహనాలు అన్నీ రోడ్డుపైనే నిలపడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మండలకేంద్రం లోని ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సోమవారం 72వ అఖిలభారత సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చైర్మన చంద్రశేఖర్‌నాయుడు, సబ్‌డివిజనల్ సహ కార అధికారి ప్రభావతి, సీఈఓ బాబాఫకృద్దీన హాజరయ్యారు. ముం దుగా జెండాను ఆవిష్కరించారు.