Share News

శ్రీవారికి ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:31 AM

స్థానిక రాజేంద్రనగర్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 25 సంవత్సరైన సందర్భంగా స్వామివారికి శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

శ్రీవారికి ప్రత్యేక పూజలు
స్వామివారి పాదాలకు అభిషేకం చేస్తున్న భక్తులు

గుంతకల్లుటౌన, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): స్థానిక రాజేంద్రనగర్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 25 సంవత్సరైన సందర్భంగా స్వామివారికి శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు కలిపిన జలంతో స్వామి వారి పాదాలకు భక్తులు అభిషేకం చేశారు. ఇందులో ఆలయ అధ్యక్షుడు ఎం భాస్కర్‌ రంగయ్య, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, రమే్‌షరెడ్డి, కోశాధికారి నారాయణస్వామి, ప్రసాద కమిటీ చైర్మన జయంతి వెంకట్‌, సభ్యులు సుదర్శన బాబు, కొండన్న, వీర, శ్రీనివాసులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 12:31 AM