Share News

శివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్‌ విడుదల

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:30 AM

కంబదూరులోని మల్లేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 8 నుంచి 16 వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో దేవదాస్‌, ధర్మకర్త హనుమంతరాయుడు, గ్రామపెద్దలు తెలిపారు.

శివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్‌ విడుదల
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఈవో, ప్రముఖులు

కళ్యాణదుర్గం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): కంబదూరులోని మల్లేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 8 నుంచి 16 వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో దేవదాస్‌, ధర్మకర్త హనుమంతరాయుడు, గ్రామపెద్దలు తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను వారు ఆ ఆలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. 14న శివపార్వతుల కల్యాణోత్సవం, గ్రామోత్సవం, 15న మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం, 16న గంగపూజతో ఈ ఉత్సవాలు ముగుస్తాయన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 12:30 AM