Share News

కూటమితోనే మైనార్టీల సంక్షేమం : ఎమ్మెల్యే

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:29 AM

క్రిస్టియన మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు.

కూటమితోనే మైనార్టీల సంక్షేమం : ఎమ్మెల్యే
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గుమ్మనూరు

గుత్తి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): క్రిస్టియన మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. స్థానిక గాంధీ సర్కిల్‌ వద్ద నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లను ఈఎ్‌సఐ సంస్థ రాయలసీమ డయాసిస్‌ బిషప్‌ దేవవరప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. అలాగే అనంతపురం రోడ్డులో నూతన కాంప్లెక్స్‌ నిర్మాణాలకు భూమి పూజ చేశారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రిస్టియన మైనార్టీల సంక్షేమానికి తమవంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పవర్‌ ఆఫ్‌ అటార్ని సీహెచబీ రసెల్‌ కిరణ్‌, రాయలసీమ డయాసిస్‌ ఉపాఽధ్యక్షుడు బెనహర్‌, కార్యదర్శి ఆనంద్‌రావు, కోశాధికారి డానియేల్‌, చర్చి ఫాదర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 12:29 AM