• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

 ఆంజనేయస్వామి రథోత్సవం

ఆంజనేయస్వామి రథోత్సవం

కార్తీక అమావాస్యను పురష్కరించుకొని మండలంలోని జే వెంకటంపల్లిలో గురువారం ఆంజనేయస్వామికి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

మురుగుకాలువ సమస్యపై సమాలోచన

మురుగుకాలువ సమస్యపై సమాలోచన

పట్టణంలో గాంధీకట్ట వద్ద నుంచి నంద్యాల రోడ్డు వరకు ఉన్న మురుగునీటి కాలువతో పట్టణ వాసులు అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి మున్సిపల్‌ అధికారులు, స్థానికులతో కలిసి గురువారం ఆ కాలువను పరిశీలించారు.

ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం

ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం

యాడికి గ్రామపంచాయతీ కార్యాల యంలో గురువారం నిర్వహిం చిన పాలకవర్గ సమావేశానికి 20 మంది వార్డు సభ్యులకు గాను కేవలం ముగ్గురు సభ్యులు దేవి, పార్వతి, సావిత్రి మాత్రమే హాజరయ్యారు.

STU: ఎస్టీయూ మండల కమిటీ ఎన్నిక

STU: ఎస్టీయూ మండల కమిటీ ఎన్నిక

తలుపుల మండలం ఓబుల రెడ్డిపల్లిలోని స్థానిక జిల్లాపరిషత ఉన్నత పాఠశాల ఆవరణంలో గురువారం ఎస్టీయూ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా వేణుగోపాల్‌, ప్రధాన కార్యదర్శిగా విజయవర్ధన రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా హరిప్రసాద్‌రెడ్డి, మహిళా కన్వీనర్‌ పద్మజ, మైనార్టీ కన్వీనర్‌ తబ్రేజ్‌ బాషా, జిల్లా కౌన్సిలర్లుగా రమణానాయక్‌, మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

DANCE: అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

DANCE: అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక శిల్పారామంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆలరించాయి.

MINISTER: కేంద్ర మంత్రికి ఘన స్వాగతం

MINISTER: కేంద్ర మంత్రికి ఘన స్వాగతం

సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి కేంద్ర జాతీయ రహదారుల, రవాణా శాఖ మంత్రి నితిన గడ్కరీ గురువారం పుట్టపర్తికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు సవిత, సత్యకుమార్‌ యాదవ్‌, బీసీ.జనారఽ్ధన రెడ్డి, కందుల దుర్గేష్‌, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, పరిటాల సునీత, ఎంఎస్‌ రాజు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ROAD: రోడ్డును ఇరువైపులా కప్పేసిన గడ్డి

ROAD: రోడ్డును ఇరువైపులా కప్పేసిన గడ్డి

మండల పరిధిలోని కమ్మ వారిపల్లి నుంచి పాత బత్తలపల్లి మీదుగా కొండేపాళ్యం వరకు రోడ్డుకు ఇరువైపుల గడ్డి ఏపుగా పెరింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు అంటున్నారు. ఏపుగా పె రిగిన గడ్డిని తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. క మ్మవారిపల్లి నుంచి పాత బత్తలపల్లి, చండ్రాయునిపల్లి, కొండేపాళ్యం మీదుగా కదిరికి వెళ్లే ఈ రహదారి 18 కిలోమీటర్లు ఉంది.

చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవం

చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవం

యాడికిలోని మార్కెట్‌వీధిలోని చౌడేశ్వరిదేవికి జ్యోతుల ఉత్సవాన్ని బుధవారం తొగటవీరక్షత్రియులు ఘనంగా నిర్వహించారు.

 నవరూప ఆంజనేయస్వామి గ్రామోత్సవం

నవరూప ఆంజనేయస్వామి గ్రామోత్సవం

గుత్తి ఆర్‌ఎ్‌సలోని నవరూప ఆంజనేయస్వామి గ్రామోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు

CM: సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

CM: సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన సొమ్మును విడుదల చేసినందుకు బుధవారం టీడీపీ మండల నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభి షేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి