Share News

గుత్తికోట డాక్యుమెంటరీ విడుదల

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:10 AM

ప్రపంచ వారసత్వాలలో భాగంగా పర్యాటక ఉత్సవాలను పురస్కరించుకుని గుత్తి కోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో రూపొందించిన గుత్తికోట డాక్యుమెంట్‌ ఫిల్మ్‌ను స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ జబ్బర్‌మీయా మంగళవారం విడుదల చేశారు.

గుత్తికోట డాక్యుమెంటరీ విడుదల
డాక్యుమెంటరీని విడుదల చేస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌

గుత్తి, ఫిబ్రవరి10(ఆంధ్రజ్యోతి): ప్రపంచ వారసత్వాలలో భాగంగా పర్యాటక ఉత్సవాలను పురస్కరించుకుని గుత్తి కోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో రూపొందించిన గుత్తికోట డాక్యుమెంట్‌ ఫిల్మ్‌ను స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ జబ్బర్‌మీయా మంగళవారం విడుదల చేశారు. కోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఇందులో ఆ సమితి అధ్యక్షుడు విజయ్‌భాస్కర్‌, ఉపాధ్యక్షుడు సుధాకర్‌నాయుడు, నాయకులు జిలాన, గంగాధర్‌, శివకుమార్‌, మున్సిపల్‌ మేనేజర్‌ రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2026 | 12:10 AM