Share News

కమీషన విడుదలపై డీలర్ల హర్షం

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:13 AM

రెండేళ్లుగా బకాయి ఉన్న కమీషన విడుదల కావడంపై మండలంలోని డీలర్లు హర్షం వ్యక్తం చేశారు.

కమీషన విడుదలపై డీలర్ల హర్షం
తహసీల్దార్‌ను సన్మానించిన డీలర్లు

బొమ్మనహాళ్‌, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): రెండేళ్లుగా బకాయి ఉన్న కమీషన విడుదల కావడంపై మండలంలోని డీలర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తహసీల్దార్‌ మునివేలు, సింగల్‌ విండో చైర్మన కొత్తపల్లి మల్లికార్జున, స్టోర్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు పయ్యావుల మోహనను వారు మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో సన్మానించారు. ఇందులో టీడీపీ నాయకులు పయ్యావుల నాగరాజు, గాలి బసప్ప, డీలర్లు కురుబ తిప్పేస్వామి, పయ్యావుల రమేష్‌, కావలి ప్రభు పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2026 | 12:13 AM