విఽధులకు ఆలస్యంగా వైద్యులు
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:12 AM
ప్రతి నెలా 9న హైరిస్క్ గర్భవతులకు పీహెచసీల్లో ప్రధాన మంత్రి మాతృత్య (పీఎంఎ్‌సఎంఏ) సురక్ష అభియాన పథకం కింద వైద్య పరీక్షలు, మందులు ఇస్తారు.
కూడేరు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రతి నెలా 9న హైరిస్క్ గర్భవతులకు పీహెచసీల్లో ప్రధాన మంత్రి మాతృత్య (పీఎంఎ్‌సఎంఏ) సురక్ష అభియాన పథకం కింద వైద్య పరీక్షలు, మందులు ఇస్తారు. దీంతో స్థానిక పీహెచసీకి సోమవారం అధిక సంఖ్యలో గర్భిణులు వచ్చారు. ఈ పీహెచసీలో ఇద్దరు వైద్యులు ఉండగా.. సోమవారం ఒకరు 104 వాహనంలో గ్రామాలకు వెళ్లారు. మరో డాక్టర్ట్ 11 గంటలైన రాకపోవడంతో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైద్యులు విధులకు ఆలస్యంగా రావడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.