తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
ABN , Publish Date - Feb 11 , 2026 | 12:12 AM
వజ్రకరూరు మండలంలోని కొనకొండ్లలో తాగునీటి సమస్య పరిష్కరించాలని మంగళవారం మహిళలు రోడ్డెక్కారు.
వజ్రకరూరు(ఉరవకొండ), ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): వజ్రకరూరు మండలంలోని కొనకొండ్లలో తాగునీటి సమస్య పరిష్కరించాలని మంగళవారం మహిళలు రోడ్డెక్కారు. ఉరవకొండ-గుంతకల్లు రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. 4, 5, 6వార్డులలో కుళాయిలకు నీరు సక్రమంగా రావడం లేదని వారు వాపోయారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఈ రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. సమస్యను పరిష్కరిస్తామని సచివాలయం ఉద్యోగులు హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.