23 నుంచి భారీ వర్షాలు
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:21 PM
23వ తేదీ నుంచి తమిళనాడు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీవర్షం కురిసే అవకాశముంది. అలాగే, డిసెంబరు మొదటి వారంలో బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ప్రాంతీయ వాతావరణకేంద్రం తెలిపింది.
చెన్నై: ‘ఆక్వాన్’ తుఫాన్ కారణంగా ఈ నెల 22వ తేదీ వరకు పొడి వాతావరణం నెలకొన్నప్పటికీ, 23 నుంచి రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీవర్షం కురిసే అవకాశముంది. అలాగే, డిసెంబరు మొదటి వారం లో బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ప్రాంతీయ వాతావరణకేంద్రం తెలిపింది. ఆక్వాన్ తుఫాను ఆంధ్ర-ఒడిసా వైపు వెళ్లిందని, తూర్పు గాలుల మార్పుల కారణంగా, 23వ తేది నుంచి రాష్ట్ర సముద్రతీర ప్రాంతాలు, దక్షిణ తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. డిసెంబరు మొదటి వారంలో దక్షిణ లేదా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ.
Read Latest AP News And Telangana News And International News And Telugu News