Share News

భారత్-కివీస్ తొలిటెస్ట్: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ 159/1

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:58 PM

వెలింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. కివీస్‌ బౌలింగ్‌కు భారత బ్యాటర్లు గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 39 ఓవర్లలో వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది.

భారత్-కివీస్ తొలిటెస్ట్: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ 159/1
India vs New Zealand Test

స్పోర్ట్స్ డెస్క్‌: వెలింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. కివీస్‌ బౌలింగ్‌కు భారత బ్యాటర్లు గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. ఇవాళ(శుక్రవారం) ఆట ముగిసే సమయానికి భారత్ 39 ఓవర్లలో వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో భారత్ ఇంకా 209 పరుగుల వెనుకంజలో ఉంది. న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ ఒక వికెట్ పడగొట్టాడు. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (52*), దేవదత్ పడిక్కల్ (16*) ఉన్నారు.


భారత్ ఇన్నింగ్స్ ప్రారంభంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (85) అర్ధ శతకంతో జట్టుకు మంచి పునాది వేశాడు. దూకుడుగా ఆడుతున్నజైస్వాల్‌ను హెన్రీ పెవిలియన్ చేర్చాడు. అతడి బౌలింగ్‌లో (27.5వ ఓవర్) జైస్వాల్ వికెట్‌ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. తొలుత అంపైర్‌ నాటౌట్‌ ఇవ్వగా.. కివీస్‌ డీఆర్‌ఎస్‌ తీసుకుంది. సమీక్షలో బ్యాట్‌ను బంతి తాకినట్లు తేలడంతో యశస్వి నిరాశగా డగౌట్ బాట పట్టాడు. దీంతో ఈ యువ ఓపెనర్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.


భారత్ ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్ విరామం తర్వాత మూడో సెషన్‌లో కివీస్‌ బౌలర్లు ఆరు నోబాల్స్ విసిరారు. 2009లో నుంచి ఒక సెషన్‌లో అత్యధిక నోబాల్స్ వేయడం ఇది రెండోసారి. గతేడాది ఇంగ్లండ్‌పైనా సరిగ్గా ఆరు వేశారు. వెల్లింగ్టన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 368 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. హెన్రీ నికోల్స్(175*),గ్లెన్ ఫిలిప్స్(118) సెంచరీలతో కివీస్ మెరుగైన స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు.


ఇవి కూడా చదవండి:

'అతిపెద్ద ద్రోహి'.. ఖవాజాపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ ఆగ్రహం!

ధోని ఆటకు పాక్ అధ్యక్షుడు ముషారఫ్ ముగ్దులయ్యారు: శుక్లా

Updated Date - Nov 20 , 2026 | 01:07 PM