Share News

ఆరు రోజులు వర్షాలు కురిసే అవకాశం

ABN , Publish Date - May 06 , 2026 | 01:49 PM

తమిళనాడు రాష్ట్రంలో ఆరు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం పేర్కొంది.

ఆరు రోజులు వర్షాలు కురిసే అవకాశం
Rains, IMD

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఆరు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం పేర్కొంది. దక్షిణ మధ్యప్రదేశ్‌ నుంచి మన్నార్‌ వలైకుడ వరకు విదర్భ, మరాఠ్వాడ, కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది. ఈ కారణంగా, తేని, దిండుగల్‌, కరూర్‌, తిరుచ్చి, నామక్కల్‌, ఈరోడ్‌, నీలగిరి, కోయంబత్తూర్‌ జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో భారీవర్షం కురిసే అవకాశముంది.


nani1.2.jpgఅలాగే, గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొని, ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2-3 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగే అవకాశముంది. చెన్నైలో ఆకాశం మేఘావృతం గా ఉంటూ, పగటి ఉష్ణోగ్రతలు 37-38 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27-28 డిగ్రీల సెల్సియ్‌సగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ముఖ్యమంత్రి పదవికి హిమంత బిశ్వశర్మ రాజీనామా..

విజయ్‌కి అధికారికంగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్..

Read Latest Telangana News and National News

Updated Date - May 06 , 2026 | 01:49 PM