Share News

ఏపీలో మరింత విస్తరించిన నైరుతి రుతుపవనాలు

ABN , Publish Date - Jun 11 , 2026 | 02:47 PM

ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. జూన్ 11వ తేదీకి రాష్ట్రంలో రుతుపవనాల పురోగతి కొనసాగుతోందని వెల్లడించారు.

ఏపీలో మరింత విస్తరించిన నైరుతి రుతుపవనాలు
AP Weather Update

అమరావతి, జూన్11, (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. జూన్ 11వ తేదీకి రాష్ట్రంలో రుతుపవనాల పురోగతి కొనసాగుతోందని వెల్లడించారు. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఉత్తరాంధ్రలో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు చేరే సూచనలు ఉన్నాయని వివరించారు. ఈ మేరకు ప్రఖర్ జైన్ ఓ ప్రకటన విడుదల చేశారు.


పార్వతీపురం మన్యం జిల్లాలో రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ప్రఖర్ జైన్ తెలిపారు. విజయనగరం జిల్లాలో మరిన్ని ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో రుతుపవనాల విస్తరణకు వాతావరణం అనుకూలంగా ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. నైరుతి రుతుపవనాల విస్తరణతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయని వివరించారు. మరో 2 నుంచి 3 రోజుల్లో ఉత్తరాంధ్రలో రుతుపవనాల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత

ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 02:59 PM