తమిళనాడులోని 18 జిల్లాలకు వర్ష సూచన
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:17 PM
తమిళనాడు రాష్ట్రంలో కొండ ప్రాంతాలు, సముద్రతీరాల్లో ఉన్న 18 జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
చెన్నై: రాష్ట్రంలో కొండ ప్రాంతాలు, సముద్రతీరాల్లో ఉన్న 18 జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పు విదర్భ నుంచి రాష్ట్ర సముద్రతీరం వరకు, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా అల్పపీడనం కేంద్రీకృతమైందని, దీని ప్రభావంతో నీలగిరి, కోవై, దిండుగల్, తేని, మదురై, ఈరోడ్, శివగంగ, తిరుచ్చి, అరియలూరు, పెరంబలూరు, కరూర్, తిరువణ్ణామలై, వేలూరు,
తిరుపత్తూర్, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, నామక్కల్ జిల్లాలు సహా డెల్టా జిల్లాలు, ఉత్తర తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని హెచ్చరించింది. అలాగే, బంగాళాఖాతంలో గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఈ కారణంగా ఆదివారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక.. అన్నకు గుండెపోటు
ఏఐని ఎలా వాడాలో తెలియకపోతే లేఆఫ్స్ ముప్పు అధికం!
Read Latest AP News And Telangana News And International News And Telugu News