ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు జై
ABN , Publish Date - Jun 20 , 2026 | 11:00 AM
హైదరాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు క్రేజ్ పెరిగింది.
ఈ ఏడాది కొత్త కోర్సుల ప్రవేశం
గవర్నమెంట్‌లో 92 శాతం, ప్రైవేటులో 54 శాతం సీట్ల భర్తీ
మిగతా 8,424 సీట్లకు జూలై 1న స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు క్రేజ్ పెరిగింది. డిప్లొమో కోర్సులు చదవాలనుకున్న అభ్యర్థులు ప్రైవేటు కన్నా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల వైపే మొగ్గుచూపారు. సికింద్రాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్‌లో 693 సీట్లకుగాను 690సీట్లు (99.60శాతం), మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 792 సీట్లలో 789సీట్లు (99.60శాతం) భర్తీ అయ్యాయి. రామంతాపూర్‌లోని జేఎన్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 99 శాతం, మేడ్చల్ పాలిటెక్నిక్‌లో 98 శాతం, సికింద్రాబాద్ మహిళా పాలిటెక్నిక్‌లో 96.60 శాతం, అబ్దుల్లాపూర్‌మెట్‌లోని 96.40శాతం, పటాన్‌చెరులోని పాలిటెక్నిక్‌లో 96 శాతం, యూసఫ్‌గూడలోని దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ మహిళా పాలిటెక్నిక్‌లో 95.80 శాతం సీట్లు భర్తీ కావడం విశేషం.
ఈ ఏడాది ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో అధునాతన కోర్సులను ప్రవేశపెట్టడం వల్లే 95శాతానికి పైగా సీట్లు భర్తీ అవడానికి ప్రధాన కారంణంగా అధికారులు చెబుతున్నారు. డిప్లమో ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, సెమీకండక్టర్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, సివిల్(బిల్డింగ్ సర్వీసె్‌స)ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, రియల్ ఎస్టేట్ అండ్ ఎవాల్యుయేషన్ వంటి కోర్సులకు అభ్యర్థుల నుంచి మంచి ఆదరణ లభించినట్లు తెలుస్తోంది.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో మొత్తం 8,424 సీట్లు మిగిలిపోయాయి. పాలిసెట్ తుదివిడత సీట్ల కేటాయింపును సాంకేతిక విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 112 పాలిటెక్నిక్‌లు ఉండగా, 33,535 సీట్లు ఉన్నాయి. ఇందులో 25,111సీట్లు (75శాతం) భర్తీ కాగా, 8424సీట్లు మిగిలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 59 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో మొత్తం 18, 538సీట్లు ఉండగా, 17,001సీట్లు (92శాతం) భర్తీ అయ్యాయి.
మరోవైపు 53 ప్రైవేటు పాలిటెక్నిక్‌లలోని 8110 సీట్లకుగాను 6,887 సీట్లే (54శాతం) భర్తీ అయ్యాయి. ఈ ఏడాది పాలిసెట్ రాసి ర్యాంకులు పొందిన 81,307 మంది అభ్యర్థులు ఉండగా, ప్రవేశాలు పొందిన వారు కేవలం 25 వేల మందే ఉన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 22 లోగా ఫీజు చెల్లించి వారికి కేటాయించిన పాలిటెక్నిక్‌లలో స్వయంగా రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే జూలై 1న స్పాట్ అడ్మిషన్ల కింద ఆయా కళాశాలలు సీట్లను భర్తీ చేసుకునేలా నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక.. అన్నకు గుండెపోటు
ఏఐని ఎలా వాడాలో తెలియకపోతే లేఆఫ్స్ ముప్పు అధికం!
Read Latest AP News And Telangana News And International News And Telugu News