Share News

ఉల్లి ధర పైపైకి

ABN , Publish Date - Aug 23 , 2024 | 10:54 PM

జిల్లాలో ఉల్లి పంట సాగు చేసిన రైతులు సంతోషంగా ఉన్నారు. గత సంవత్సరం ఇదే సమయానికి క్వింటం ఉల్లి కేవలం రూ.300 నుంచి రూ.400కు అమ్ముడుపోయింది.

ఉల్లి ధర పైపైకి

కర్నూలు(అగ్రికల్చర్‌), ఆగస్టు 23: జిల్లాలో ఉల్లి పంట సాగు చేసిన రైతులు సంతోషంగా ఉన్నారు. గత సంవత్సరం ఇదే సమయానికి క్వింటం ఉల్లి కేవలం రూ.300 నుంచి రూ.400కు అమ్ముడుపోయింది. శుక్రవారం కర్నూలు మార్కెట్‌ యార్డులో రైతులు 796 క్వింటాళ్ల ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. గరిష్ఠ ధర రూ.3,934, మధ్యస్థ ధర రూ.3,587, కనిష్ఠ ధర రూ.1,237 ధర పలికిందని సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ గోవిందు, అదనపు సెక్రటరీ వెంకటేశ్వర్లు తెలిపారు. అదేవిదంగా వేరుశనగ కాయలు 874 క్వింటాళ్లు అమ్మకానికి రాగా, క్వింటా గరిష్ఠ ధర రూ.7,046, మధ్యస్థ ధర రూ.5,306, కనిష్ఠ ధర రూ.3,600 రైతుల చేతికి అందిందని సెక్రటరీ గోవిందు తెలిపారు. ఆముదాలు గరిష్ఠ ధర రూ.5,849, మధ్యస్థ ధర రూ.5,802, కనిష్ఠ ధర రూ.5,490 పలికిందన్నారు. వాము గరిష్టం రూ.15,812, మధ్యస్థం రూ.15,188, కనిష్ఠం రూ.11,440, కందుల ధర కాస్త తగ్గింది. గరిష్ఠ ధర రూ.9,319, కనిష్ఠంగా రూ.5,235 ధర పలికింది. మిరపకాయల ధర పూర్తిగా తగ్గిపోయింది. గరిష్ఠ ధర రూ.3,934, మధ్యస్థం రూ.3,659, కనిష్ఠం రూ.2,819లు రైతులకు అందిందని సెక్రటరీ తెలిపారు.

Updated Date - Aug 23 , 2024 | 10:54 PM