అతి తీవ్ర తుపానుగా ‘అక్వాన్’.. తమిళనాడులోని ఉత్తర జిల్లాలకు భారీ వర్ష సూచన
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:37 PM
బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్ర వాయుగుండం ‘అక్వాన్’ తుపానుగా బలపడింది. దీని ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లో బుధవారం నుంచి ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్ర వాయుగుండం ‘అక్వాన్’ తుపానుగా బలపడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లో బుధవారం నుంచి ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముంచుకొస్తున్న అక్వాన్ తుఫాన్ బంగాళాఖాతంలో దక్షిణ ఆగ్నేయంగా సుమారు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, ఇది బుధవారం మధ్యాహ్నం తర్వాత అతి తీవ్ర తుఫాన్‌గా మారి ఆంధ్రప్రదేశ్‌లో తీరం దాటే అవకాశమున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
అక్వాన్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో, చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, రాణిపేట, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, విల్లుపురం, కడలూరు, మైలాడుదురై, పుదుచ్చేరి ప్రాంతాల్లో ముందస్తు జాగ్రతలను విపత్తు నివారణ అధికారులు చేపట్టారు. సముద్రంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మరలా ఉత్తర్వులు జారీ అయ్యే వరకు జాలర్లు చేపలవేటకు వెళ్లరాదని ప్రభుత్వం సూచించింది. ఇదిలా వుండగా, ఈదురుగాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చెన్నై వాతావరణశాఖ జారీచేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అధికారులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
పంజాబ్ రైతుకు జాక్‌పాట్.. రూ.500 పెట్టి టికెట్ కొంటే రూ.12 కోట్ల లాటరీ..
కశ్మీర్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News