Share News

యోగి x యూపీ సీఈవో

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:56 AM

సర్‌ ప్రక్రియలో ఉత్తరప్రదేశ్‌లో 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతయ్యాయని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన ఆరోపణలకు ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) నవదీప్‌ రిన్వా జవాబిచ్చారు.

యోగి x యూపీ సీఈవో
yogi

  • సర్‌లో 1.27 కోట్ల హిందువుల ఓట్లు గల్లంతు

  • యూపీ ముఖ్యమంత్రి యోగి ఆరోపణ

  • కుల, మతప్రాతిపదికన ఓటర్ల జాబితాలుఉండవన్న ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

లఖ్‌నవూ, నవంబరు 17: సర్‌ ప్రక్రియలో ఉత్తరప్రదేశ్‌లో 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతయ్యాయని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన ఆరోపణలకు ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) నవదీప్‌ రిన్వా జవాబిచ్చారు. కుల, మతప్రాతిపదికన ఓటర్ల జాబితాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) రూపొందించదని స్పష్టంచేశారు. సర్‌ ప్రక్రియ ముగియడంతో మంగళవారం యూపీ ఓటర్ల తుది ముసాయిదా జాబితాను ఆయన విడుదల చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య 13,58,68,905గా పేర్కొన్నారు. తొలగించిన ఓట్లపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు సమర్పించడానికి మంగళవారం నుంచి డిసెంబరు 16 వరకు గడువుందన్నారు. డిసెంబరు 28లోపు అన్నిటినీ పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 4న తుది జాబితాను ప్రచురిస్తామని చెప్పారు. అయితే, అయితే సర్‌ ప్రక్రియలో అవకతకవకలు ఉన్నాయని యోగి ఓ వార్తాసంస్థకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మాయమైన ఓట్లలో 66 లక్షల మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులేనని, వీరిలో 55 లక్షల మంది హిందువులని అన్నారు. అలాగే 18-19 ఏళ్ల వయసున్న 4.5 లక్షల మంది పేర్లు కూడా జాబితాలో లేవని చెప్పారు. 2027 మొదట్లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో యోగి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి..

ఢిల్లీలో కుప్పకూలిన 50 ఏళ్ల నాటి భవనం.. చిన్నారితో సహా ఇద్దరి మృతి

గ్రామాల విలీనంపై సుప్రీం విచారణ వాయిదా

Updated Date - Nov 18 , 2026 | 06:32 AM