గ్రామాల విలీనంపై సుప్రీం విచారణ వాయిదా
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:58 AM
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో విలీనం చేసిన వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణను...
న్యూఢిల్లీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో విలీనం చేసిన వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ప్రధానంగా.. పొన్నూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, కందుకూరు, భీమవరం, గూడూరు, గుడివాడ మున్సిపాలిటీలతో పాటు శ్రీకాకుళం, రాజమహేంద్రవరం కార్పొరేషన్లు, రాజానగరం అప్‌గ్రేడ్ (మున్సిపాలిటీగా) పరిధిలోని గ్రామాల పరిధి నుంచి ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.
అవి మంగళవారం జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. ఏపీ మున్సిపల్ చట్టాల (సవరణ) చట్టం-2021 రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తామని ధర్మాసనం వెల్లడించింది.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు