Share News

ఢిల్లీలో కుప్పకూలిన 50 ఏళ్ల నాటి భవనం.. చిన్నారితో సహా ఇద్దరి మృతి

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:38 PM

దేశరాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఢిల్లీలో కుప్పకూలిన 50 ఏళ్ల నాటి భవనం.. చిన్నారితో సహా ఇద్దరి మృతి
Delhi Building Collapse

ఢిల్లీ, నవంబర్ 17: దేశరాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు (మంగళవారం) ఉదయం తూర్పు ఢిల్లీలోని షాదరా జిల్లాలోని వివేక్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జ్వాలా నగర్ ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 50 ఏళ్ల నాటి రెండు అంతస్తుల పురాతన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, పోలీసు సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


శిథిలాల కింద చిక్కుకున్న సుమారు ఎనిమిది మందిని సురక్షితంగా కాపాడారు. అయితే ఈ ప్రమాదంలో చిన్నారితో పాటు ఓ యువకుడు మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. శిథిలాల కింద మరికొంత మంది ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


ఇవి కూడా చదవండి...

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వంతెన పైనుంచి లోయలోకి దూసుకెళ్లి..

ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..

Read Latest National News And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 05:11 PM