Share News

అల్పపీడనం ప్రభావం .. ఏపీలో భారీ వర్షాలు

ABN , Publish Date - Oct 22 , 2026 | 06:34 PM

బంగాళాఖాతంలో రేపు(శుక్రవారం) అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఆది, సోమవారాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు.

అల్పపీడనం ప్రభావం .. ఏపీలో భారీ వర్షాలు
AP Rainfall News

అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో రేపు(శుక్రవారం) అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఆది, సోమవారాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. అల్పపీడనం మరింత బలపడి కోస్తాంధ్ర తీరం వైపు వాయుగుండం రానుందని పేర్కొన్నారు. సోమవారం నుంచి ఏపీలో మూడు రోజుల పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.


ఆదివారం రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ఆదివారం నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు ఆదివారం లోపు తీరానికి చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. వానల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు(శుక్రవారం) మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.


కోస్తాంధ్రాలో భారీ వర్షాలు

నైరుతీ బంగాళాఖాతం దానికి ఆనుకున్న ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ మూర్తి తెలిపారు. అల్పపీడనం ప్రభావం కారణంగా కోస్తాంధ్రాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకున్న ఉన్న తూర్పు, మధ్య బంగాళాఖాతం మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రభావంతో ఈ ప్రాంతాల్లో రేపు ఒక అల్పపీడం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. రానున్న రెండు రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని చెప్పారు. 25 తేదీన వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లిన వారు తీరానికి రావాలని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ మూర్తి సూచించారు.


ఇవి కూడా చదవండి...

విశాఖలో రోడ్డు ప్రమాదం.. గాయపడిన విద్యార్థులకు హోంమంత్రి అనిత సాయం

నకిలీ వాట్సాప్ నిర్వాహకులకు పవన్ కల్యాణ్ కార్యాలయం హెచ్చరిక

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 22 , 2026 | 09:12 PM