ఉడతతో అపురూప స్నేహం.. చిన్నారి ప్రేమకు నెటిజన్లు ఫిదా

ABN, Publish Date - Nov 22 , 2026 | 06:01 PM

కుక్కలు, పిల్లులు, చిలుకలతో స్నేహం చేయడం చూస్తుంటాం.. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన అంజలి అనే చిన్నారి మాత్రం ఉడతతో వినూత్న స్నేహం చేస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కుక్కలు, పిల్లులు, చిలుకలతో స్నేహం చేయడం చూస్తుంటాం.. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన అంజలి అనే చిన్నారి మాత్రం ఉడతతో వినూత్న స్నేహం చేస్తోంది. పాఠశాలకు వెళ్లే దారిలో భయంతో వణికిపోతున్న చిన్న ఉడత పిల్లను ఇంటికి తెచ్చి ప్రేమగా పెంచుకుంటోంది.


ప్రతిరోజూ పాలు, బిస్కెట్లు, పండ్లు తినిపిస్తూ కంటికి రెప్పలా కాపాడుతోంది. ఆ ఉడత కూడా చిన్నారిని వదిలి ఉండలేక, ఆమె స్కూల్ నుంచి రాగానే పరుగులు తీస్తూ ఒడిలోకి చేరుతుంది. వీరిద్దరి ఆప్యాయతను చూసి గ్రామస్తులు ముచ్చటపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం

ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు

స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated at - Nov 22 , 2026 | 06:06 PM