బలపడుతున్న వాయుగుండం.. రేపు రాత్రికి తీరం దాటే అవకాశం
ABN, Publish Date - Sep 22 , 2026 | 06:41 PM
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
అమరావతి, సెప్టెంబర్ 22: గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశలో దూసుకొస్తున్న వాయుగుండం రేపు(బుధవారం) రాత్రికి విశాఖ గోపాల్పూర్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఐదు రోజుల పాటు అలర్ట్ ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.
Updated at - Sep 22 , 2026 | 06:44 PM