అమెరికాలో 2 లక్షల వీసాలు రద్దు ..!?

ABN, Publish Date - Aug 26 , 2026 | 10:46 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుమారు రెండు లక్షల మంది విదేశీయులకు చెందిన వ్యాపార పర్యాటక వీసాలను రద్దు చేయడానికి డొనాల్డ్ ట్రంపు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుమారు రెండు లక్షల మంది విదేశీయులకు చెందిన వ్యాపార పర్యాటక వీసాలను రద్దు చేయడానికి డొనాల్డ్ ట్రంపు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టూరిస్ట్ లేదా బిజినెస్ వీసాల మీద తాత్కాలిక సందర్శకులుగా అమెరికాలో అడుగుపెట్టి ఆ తర్వాత అక్కడే శాశ్వతంగా ఉండిపోవడానికి ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీయులే లక్ష్యంగా మరికొద్ది వారాల్లో అమెరికా విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.


2016 నుంచి 2026 మధ్య కాలంలో B1, B2 వీసాలు పొందిన వారు ఈ చర్యల పరిధిలోకి రానున్నట్లు సమాచారం. ఒకవేళ ఇంత పెద్ద సంఖ్యలో వీసాలను ఒకేసారి రద్దు చేస్తే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వీసా రద్దు చర్యగా ఇది నిలవనుంది. వీసా తీసుకునే సమయంలో తాత్కాలికంగానే ఉంటామని చెప్పి వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ చట్టాల్లోని వెసులుబాటును వాడుకుంటూ శాశ్వతంగా ఉండిపోవాలని కొంతమంది చూడటం పక్కదారి పట్టించడమేనని విదేశాంగ శాఖ ప్రతినిధి టామ్ పిగాట్ అభిప్రాయపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పైలట్ల డోప్ టెస్టులపై కేంద్రం ఫోకస్‌.. ఏడాదికి ఒకసారి పరీక్షకు యోచన: రామ్మోహన్

బీసీలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు.. యనమల ధ్వజం

వన మహోత్సవం లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: మంత్రి సీతక్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated at - Aug 26 , 2026 | 10:50 AM