తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత.. పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా
ABN, Publish Date - Oct 30 , 2026 | 10:43 AM
డిసెంబర్ 7,8,9 వ తేదీల్లో నిర్వహించే ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ సన్నాహక కార్యక్రమాన్ని గురువారం ఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
‘తెలంగాణలో పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడికి భద్రత లభిస్తుంది. పారిశ్రామిక వేత్తలకు మా ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుంది. మీ పెట్టుబడులకు సంరక్షకుడిలా ఉంటాను’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామిక వేత్తలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలని అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
Read Latest AP News And Telangana News And International News And Telugu News
Updated at - Oct 30 , 2026 | 10:52 AM