జాడలేని వాన.. వర్షాలు పడాలని పూజలు

ABN, Publish Date - Jul 15 , 2026 | 07:47 AM

తెలంగాణలో తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు నెలలుగా వాన జాడ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెలంగాణలో తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు నెలలుగా వాన జాడ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆరుతడి పంటలు వేయాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు వర్షాలు కురవాలంటూ పలు ప్రాంతాల్లో మహిళలు పూజలు చేస్తున్నారు. ఈ వర్షాకాలం తెలంగాణ రైతులకు పీడకలను మిగిల్చే ప్రమాదమే కనిపిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వానాకాలం ప్రారంభమై 40 రోజులు గడిచిన ఆశించిన వర్షం కురవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated at - Jul 15 , 2026 | 07:51 AM