LIVE : మహా వరుణ యాగంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు

ABN, Publish Date - Aug 10 , 2026 | 03:23 PM

నాగార్జునసాగర్ విజయ విహార్ కృష్ణ నది వద్ద నిర్వహిస్తున్న మహా వరుణ యాగంలో సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. పూర్ణహుతిలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇంటర్‌నెట్ డెస్క్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ విజయ విహార్ కృష్ణ నది వద్ద నిర్వహిస్తున్న మహా వరుణ యాగంలో ఈరోజు (సోమవారం) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. పూర్ణహుతి క్రతువులో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ మహా వరుణ యాగంలో సీఎం దంపతులు యాగ క్రతువులు నిర్వహించారు. 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో మహాయాగం జరిగింది. ఇవాళ ఉదయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఈ యాగాన్ని ప్రారంభించారు.

Updated at - Aug 10 , 2026 | 05:08 PM